NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వ‌ల‌స నేత పెద్దిరెడ్డి వ‌ద్దు.. లోక‌ల్ బోడే ముద్దు.. పుంగ‌నూరోళ్ల మాట మారుతోంది..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వర్గంలో ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌నేది ప‌క్క‌న పెడితే.. అస‌లు వాస్త‌వం ఏంటి ? అనేది ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. పుంగ‌నూరు నుంచి కొన్ని ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతున్నారు. అయితే.. వాస్త‌వానికి ఆయ‌న కు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధం లేదు. అస‌లు పెద్దిరెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పీలేరు. అయితే.. అక్క‌డ ఆయ‌న ప్ర‌జ‌ల‌తో ఆమోద ముద్ర వేయించుకోలేక పోయారు.

దీంతో పీలేరును వ‌దిలి పెట్టి.. పుంగ‌నూరుకు వ‌చ్చి.. చ‌క్రం తిప్పుతున్నారు. ఇక్క‌డ వ‌రుస విజ‌యాలు కూడా ద‌క్కించుకుంటున్నారు. పోనీ.. ఆయ‌న ఇక్క‌డ అభివృద్ధి చేశారా? ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చారా ? అంటే.. అది లేదు. పైగా.. ఆయ‌న సంపాయించుకున్నార‌నే వాద‌న ఉంది. త‌న కుమారుడికి టికెట్లు ఇప్పించుకున్నారు.. త‌న వారికి టికెట్లు ఇప్పించుకున్నారే త‌ప్ప‌. నియోజ‌వ‌ర్గంలో ఇంకెవ‌రినీ ఎద‌గ‌కుండా చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు ఆయ‌న‌నే గెలిపించారు.

కానీ, రోజులు అన్నీ ఒకేలా ఉండ‌వు. ఇప్పుడు పుంగ‌నూరులో స్థానికుడు, ఇక్క‌డే పుట్టి, ఇక్క‌డే చ‌దువుకుని, ఉన్న‌త స్తాయిలోకి వెళ్లిన బోడే రామ‌చంద్రయాద‌వ్ నేనున్నానంటూ.. ముందుకు వ‌చ్చారు. ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డ్డారు. పోలీసుల నుంచి వైసీపీ నాయ‌కుల నుంచి వ‌చ్చిన అనేక ఎదురు గాలుల‌ను ఆయ‌న బ‌లం గా ఎదుర్కొన్నారు. అంతేకాదు.. పోలీసుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. ఆయ‌న క‌ద‌ల‌కుండా నియోజ‌క వ‌ర్గంలోనే ప‌నిచేస్తున్నారు. సుమారు 50 కేసులు పెట్టారు. అయినా వెనుదిర‌గ‌లేదు.

అంతేకాదు.. బీసీల త‌ర‌ఫున కూడా రామ‌చంద్ర‌యాదవ్ పోరాటాలు చేస్తున్నారు. బీసీవై త‌ర‌ఫున ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. విద్యార్థుల‌కు సాయం అందిస్తున్నారు. ఉచితంగా భోజ‌నం అందించే క్యాంటీన్ల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక‌, ర‌హ‌దారుల ధ్వంసం.. అధికార పార్టీ విధ్వంసాల‌పైనా పోరాటాలు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై శ్వేత ప‌త్రం కూడా విడుద‌ల చేశారు.

బీసీ నేత ఇంత క‌ష్ట‌ప‌డి పైకి వ‌స్తే ఆయ‌న్ను పెద్దిరెడ్డి తీవ్ర చ‌ర్య‌ల‌తో అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు బీసీల్లో బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తాము పెద్దిరెడ్డి ప‌ల‌కీ మోశాం అని.. ఇప్పుడు మాకు లోక‌ల్ వాడే కావాల‌న్న టాక్ స్థానికంగా బ‌లంగా వినిపిస్తోంది. మొత్తానికి పెద్దిరెడ్డికి స‌రైన ప్ర‌త్య‌ర్థి అయితే ఇన్నేళ్ల‌కు త‌గిలిన‌ట్టే అనుకోవాలి.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?