NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం .. నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు అనుమతి

Share

Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును నిందితుడుగా ఏపీ సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నెలాఖరున సుప్రీం కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్నది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఈ కేసులో నిందితుల ఆస్తులను ఆటాచ్ చేయాలని సీఐడీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది.

ఫైబర్ నెట్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ ఈ నెల 6న ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. టెరాసాఫ్ట్ కంపెనీతో పటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది. సీఐడీ ప్రతిపాదించిన ఈ అంశంపై రాష్ట్ర హోంశాఖ గత నెలలో ఇచ్చిన అనుమతిని కోర్టుకు తెలిపింది. ఏపీ, తెలంగాణలో నిందితులకు సంబంధించి ఏడు స్థిరాస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ లో కోరగా, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ.114 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ 1 గా వేమూరి హరికృష్ణ, ఏ 11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్ పేర్లు ఉండగా, చంద్రబాబు పేరును ఏ – 25 గా సీఐడీ చేర్చింది.

ఈ కేసులో నిందితుడు తుమ్మల గోపీచంచ్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసూఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలతో పాటు నెటాప్స్ ఫైబర్ సెల్యూషన్ డైరెక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకు చెందిన గుంటూరు, విశాఖ, కిర్లంపూడి లేఅవుట్ లోని ఇళ్లు, అలానే గుంటూరులోని ఇంటి స్థలం, విశాఖలో ఓ ఫ్లాట్, హైదరాబాద్ లోని నాలుగు ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఆటాచ్ జాబితాలో ఉన్నాయి.

Chandrababu: చంద్రబాబు బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్


Share

Related posts

Insomnia: ఇది తాగితే క్షణాల్లో నిద్ర పడుతుంది..!! కనీసం 8 గంటలు నిద్ర పోతారు..!!

bharani jella

Chiranjeevi: ఫాదర్స్ డే..! చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ లుక్.. అదుర్స్

Muraliak

విగ్రహాల ధ్వంసం ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్రే అంటున్న ఆ స్టార్ నటుడు..??

sekhar