గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎట్ హోమ్ (తేనీటి విందు) కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, ఇతర ప్రముఖులు హజరైయ్యారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే దినోత్సవం నాడు రాజ్ భవన్ లో గవర్నర్ తేనీటి విందు ఇస్తుంటారు. విజయవాడ రాజ్ భవన్ వేదికగా జరిగిన ఈ ఎట్ హోమ్ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ఈ తేనీటి విందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కిషోర్ మిశ్రా దంపతులు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్. పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ విందులో ఏస్ షట్టర్ పీవీ సిందు హజరై సెంట్రాఫ్ అట్రాక్షన్ నిలిచారు.

మరో పక్క ఎట్ హోమ్ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. రిపబ్లిక్ డే దందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమానికి అహ్వానించిన గవర్నర్ కు ధన్యవాదాలు తెలుపుతూనే .. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 తీసుకువచ్చి ప్రజాస్వామిక హక్కులను కాలరాసిందని ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.
