NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఎమోషనల్ స్పీచ్ వెనుక..

YSRCP: మాజీ మంత్రి, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి తన ఆవేదనను బహిరంగ వేదికపై మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఎమోషనల్ స్పీచ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గ ప్రజలు తనను ఎప్పుడూ ఆదరిస్తున్నా, అభిమానిస్తున్నా సీఎం వైఎస్ జగన్ మాత్రం తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్ధసారది.

వైసీపీ సామాజిక బస్సు యాత్ర వేదికపై ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం వెనుక ఇన్ చార్జిల మార్పులు, చేర్పుల వ్యవహారంలో తనను పక్కన పెట్టే అవకాశం ఉందని బావించే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా సీనియర్ నేతగా ఉన్న కొలుసు పార్ధసారధికి జగన్ కేబినెట్ లో అవకాశం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు అవకాశం లభించలేదు. ఆ తర్వాత రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో అయినా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని పార్ధసారధి ఆశించారు. కానీ జగన్ అవకాశం కల్పించలేదు. దీంతో అప్పట్లోనే అసంతృప్తిని వ్యక్తం చేశారు.

గతంలో వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేసిన పార్ధసారధి .. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోవాల్సి వచ్చింది. దానికి తోడు రాబోయే ఎన్నికల్లో పెనమలూరు టికెట్ ను కూడా సర్వే నివేదికల ఆధారంగా మరొకరికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే.. పెనమలూరులో 2009 ఎన్నికల్లో పిఆర్పీ అభ్యర్ధికి 30వేలకు పైగా ఓట్లు రాగా నాడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కొలుసు పార్ధసారది కేవలం 117 ఓట్ల తో టీడీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు.

రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరిన కొలుసు పార్ధధి 2014 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. పెనమలూరులో 2014 లో టీడీపీ అభ్యర్ధి బోడె ప్రసాద్ 30వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పార్ధసారది వైసీపీ తరపున పెనమలూరు నుండి పోటీ చేసి బొడే ప్రసాద్ పై కేవలం 11, 317 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్ధికి 15వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఈ సారి టీడీపీ – జనసేన కూటమి అభ్యర్ధి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుండి బలమైన అభ్యర్ధిని రంగంలో దింపే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తొందన్న వార్తలు వినబడుతున్నాయి.

ఈ కారణంగానే సామాజిక సాధికార యాత్రలో పార్ధసారది కీలక వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. సీఎం జగన్ తనను గుర్తించలేదన్న బాధను వ్యక్తం చేశారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, తాను ఎమ్మెల్యేని కాదని సేవకుడిగా ఉంటానని అన్నారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని పార్ధసారధి చెప్పుకురావడం చూస్తుంటే ఎన్నికలకు దూరంగా ఉండటానికి సిద్దపడ్డారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Union Minister Mansukh Mandaviya: ఏపీలో వైద్య సేవలను ప్రశంసించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవియా

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju