NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: పంచమి నీ కొట్టిన మోక్ష..

Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights

Naga Panchami:  మీరు మోక్షాన్ని కాటు వేసి నాగలోకానికి వచ్చేయండి నేను ఆ మొక్కను తెచ్చి మోక్షను బ్రతికిస్తాను అని ఫణింద్ర అంటాడు. నువ్వు రాకపోతే అని పంచమి అంటుంది.  యువరాణి మీరు మోక్షాన్ని కాటు వేసి నాగులోకానికి వెళ్లి ఆ మొక్కను మీరు తీసుకురండి ఈ లోగా మోక్షని నేను కాపాడుతాను అని ఫణీంద్ర  అంటాడు.  నేను ఆ మొక్కని వెతికి తీసుకురాగలనా అని పంచమి అంటుంది. మీరు నాగలోకానికి నాగదేవతకు తెలియకుండా వెళ్లి ఆ మొక్కను తీసుకురండి ఆ మొక్క గురించి నేను చెప్తాను అని ఫణీంద్ర అంటాడు. ఇవన్నీ జరిగే పనులు కాదు యువరాణి ఈలోగా మోక్ష ప్రాణాలు పోతాయి మొదట్లో అనుకున్నది ఏంటి  యువరాణి ఇంకేమీ ఆలోచించకుండా నాగమణిని తీసుకువచ్చే ప్రయత్నం ఆలోచించండి అని మేఘన అంటుంది. నాకు ఏదైనా ఒకటే యువరాణి ముక్కోటి ఏకాదశి వచ్చేస్తుంది ఏది చేసినా ఈలోపే ఆలోచన చేయాలి లేదంటే ముక్కోటి ఏకాదశి నాడు  మోక్షాన్ని కాటు వేసి నాలోకానికి నేను వెళ్ళిపోతాను ఏం చేస్తావో త్వరగా తేల్చుకో అని ఫణీంద్ర అంటాడు. ఆ మొక్క మీద నువ్వు అసలు పెట్టుకోకు పంచమి నాగమణి ఎలా తీసుకురావాలో ఆలోచించు అని మేఘన వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights
Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights

లేని సమస్యలు సృష్టించే నిద్రపోకుండా ఉండడమే అలవాటు అనుకుంటా వైదేహి అని రఘు అంటాడు. మన మోక్షని తలుచుకుంటే నాకు నిద్ర పట్టడం లేదు పైగా మీరేమో నన్ను ఎత్తిపోటు మాటలతో బాధపెడుతున్నారు అని వైదేహి అంటుంది. వైదేహి మోక్ష గురించి మనకు తెలుసు మోక్ష పంచమి సర్దుకుపోతారు. దాని విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచించి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచొద్దు అని రఘు అంటాడు. నాకైతే వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తారని పిల్లనికంటారని నాకు నమ్మకం లేదు అని వైదేహి అంటుంది. వైదేహి అది వాళ్ళిద్దరి ఇష్టం వాళ్లకు వదిలేయ్ అని రఘు అంటాడు. మీరేంటండి అలా అంటారు వాళ్ళిద్దరు ఎందుకు సంతోషంగా ఉండటం లేదు ఏదో మార్గంగా మాట్లాడుతుంది తప్ప ఏ విషయం స్పష్టంగా చెప్పడం లేదు నా మోక్షకి ఏదైనా గండం ఉందా అని కూడా అడిగాను చివరికి విసుగు వచ్చి మా వాడి జీవితం నుంచి వెళ్ళిపో అని ఓటు కూడా వేయించుకున్నాను అని వైదేహి అంటుంది.

Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights
Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights

నువ్వు చాలా తొందర పడుతున్నావ్ వైదేహి అని రఘు అంటాడు. లేదండి పంచమి లో ఏదో లోపం ఉంది జోక్యం చేసుకుంటే తప్ప మన మోక్ష ఊబిలో నుంచి బయటపడడనిపిస్తుంది అని వైదేహి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలని నీ ఆలోచన అని రఘు అంటాడు. పంచమిని మోక్ష జీవితం నుంచి తప్పించాలి అని వైదహి అంటుంది. అలా చేస్తే పాపం తగులుతుంది వైదహి అని రఘు అంటాడు. అలాగని మనం మోక్షకి అన్యాయం చేస్తామా పంచమిని వెళ్ళగొట్టాలి మోక్షకి పెళ్లి చేయాలి అని వైదేహి అంటుంది. పెద్దవాళ్లు కలపడానికి ప్రయత్నించాలి కానీ విడిపోవడానికి సలహాలు ఇవ్వకూడదు అని రఘు అంటాడు. నేను చేసే పనికి అడ్డు రాకుండా ఉండండి ఏం చేయాలో నేను చూసుకుంటాను అని వైదేహి కోపంగా వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights
Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights

చిత్ర స్వీట్లు తెచ్చుకొని తిందామని హాల్లో పెట్టుకొని మళ్ళీ వాటర్ మర్చిపోయాను అంటూ వెళ్ళిపోతుంది.  ఆ బొండాలు వాసన పసిగట్టి మేఘన తన  మాయం చేసి తను తినేస్తుంది. అక్క ఏంటి  నేను వెళ్లి వచ్చేలోపు బొండాలన్నీ తినేసావు అని చిత్ర అంటుంది. నేనెందుకు తిన్ననే సరింగా చూసుకో ఎక్కడ పెట్టావో అని జ్వాలా అంటుంది. బటిలో వాటర్ కూడా అలాగే మాయమైపోతాయి. చిత్ర నువ్వు వాటర్ తెచ్చావో లేదో అని జ్వాల అంటుంది. తన చేతిలో ఉన్న డ్రైఫ్రూట్స్ కూడా మాయమైపోతాయి. ఇదేంటి చిత్ర ఇది కూడా మాయమైపోయాయి ఇంట్లో ఏం జరుగుతుంది అని జ్వాలా అంటుంది. అక్క అంతా ఆ పంచమి తెచ్చిన అమ్మాయి మాయం చేసి ఉంటుంది అని చిత్ర అంటుంది. ఇంతలో మేఘన వచ్చి మీ డ్రైఫ్రూట్స్ బోండాలు చాలా బాగున్నాయి అని బేవరిస్తూ వెళ్ళిపోతుంది మేఘన. అక్క ఈ బొండాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ మళ్లీ వచ్చాయి అని చిత్ర అంటుంది. ఇలాంటి మాయలన్నీ ఆ పంచమే చేస్తూ ఉంటుంది దాన్ని సంగతి చెప్తాను అని జ్వాల వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights
Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights

మోక్ష బెడ్ షీట్ తీసుకొని బయటికి వెళ్లి పోతూ ఉంటాడు. మోక్ష బాబు ఎక్కడికి వెళ్తున్నారు అని పంచమి అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మోక్ష అంటాడు. ని కాళ్లు పట్టుకుంటాను మోక్ష బాబు నా మాట వినండి అని పంచమి అంటుంది. నువ్వు ఎవరో నేనెవరో అని మోక్ష కోపంగా బయటికి వెళ్లిపోతాడు. పంచమి కూడా తన వెనకాలే హాల్లోకి వస్తుంది వద్దు మీరు ఇక్కడ పడుకోడానికి వీల్లేదు అని పంచమి అంటుంది. పంచమి నాకు బాగా కోపం తెప్పిస్తున్నావ్ అని మోక్ష అంటాడు. మీ కోపం నా మీద చూపించండి మీరు ఇక్కడ పడుకుంటే ఇంట్లో వాళ్ళందరూ అనుమానిస్తారు మన విషయాలు నలుగురికి తెలియకూడదు అని పంచమి అంటుంది. ఇక మన మధ్య దాచుకోవడానికి ఏమీ లేదు పంచమి నువ్వే నా ప్రాణం అనుకున్నాను కానీ నువ్వు నన్ను చాలా అలుసుగా చూస్తున్నావ్  నేను భర్త నా గౌరవం నీకు లేదు ఎవరు విన్నా ఇక నాకు భయం లేదు వెళ్ళిపో ఇకనుంచి అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights
Naga Panchami Today Episode December 29 2023 Episode 238 Highlights

మనం గదిలోకి వెళ్లి మాట్లాడుకుందాం మోక్ష బాబు అని పంచమి అంటుంది. వస్తాను కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని మోక్ష అంటాడు. పంచమి ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు వినవు నీ మాటే నెగ్గాలి అని మోక్ష అంటుంది. అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం అని పంచమి అంటుంది. ఇప్పుడే తేలిపోవాలి లేదంటే నేను నా మొహం చూపించను అని మోక్ష అంటాడు.మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను మీ చివరి క్షణం వరకు మీ వెంటే ఉంటాను అని పంచమి అంటుంది. నిన్నే కాదు అందరిని వదిలి వెళ్ళిపోతాను నాకు కోపం తెప్పించకు వెళ్ళిపో అని మోక్ష కోపంగా ఉంటాడు. పైనుంచి రఘు వైదేహి చూస్తూ ఉంటారు. మీరు నా వెంట రండి అని పంచమి మోక్షాన్ని బలవంతంగా తీసుకు వెళుతుంది. దానితో కోపం తెచ్చుకొని మోక్ష పంచమిని కొట్టేస్తాడు. నన్ను చివరికి ఒక పశువును చేసేసావు నీకు సంతోషంగా ఉందా ఒక్క దెబ్బతో నాలో ప్రేమను చంపేసి రాక్షసుడు చేసేసావు ఇంతకంటే ఏం దిగజారాలి అని మోక్ష కోపంగా వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. పంచమి బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది..

Related posts

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri