MAA Elections: రాజకీయాలకు మించిన సినిమా..!? మా కు బుద్దిలేదేమో..!?

Share

MAA Elections: గత కొద్ది రోజులుగా మా ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల హాడావుడి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన  సంగతి తెలిసిందే. మా ఎన్నికలకు ఇప్పట్లో లేవు.  సెప్టెంబర్ నెలలో అంటే రెండు నెలల తరవాత జరిగే ఎన్నికలకు ఇప్పటి నుండే మాలో పెద్ద రాజకీయం జరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో చిన్నా పెద్ద ఆర్టిస్ట్ లకు దాదాపు 25వేలకు పైగా ఉండగా, అందులో పేరుమోసిన వారు ఓ అయిదు వేల మంది వరకూ ఉంటారు. అయితే మా అసోసియేషన్ (మా)లో మాత్రం కేవలం 900 నుండి వెయ్యి లోపు సభ్యులు ఉన్నారు. ఈ 900 మంది ఎన్నుకునే కార్యవర్గం కోసం పేరు మోసిన నటీనటులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై విమర్శలు, ఆరోపణలతో ఒకరు మాటలు తూటాలు పేల్చుకోవడం ఆక్షేపణీయంగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. మాలో ఉన్న 900 ఓట్ల కోసం నలుగురు పోటీ పడటం, కులాల పేరిట తిట్లు, దుర్భాషలు,తిట్లు, మతాల పేరిట, ప్రాంతాల పేరిట, పార్టీల పేరిట రాజకీయం కొనసాగడం, విమర్శలు, ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది.

MAA Elections politics
MAA Elections politics

Read More: Breaking: తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు..! కేసిఆర్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ..!!

ఓ ఎమ్మెల్యే పదవి కోసమే, ఓ ఎంపి స్థానం కోసమో లేక సీఎం కూర్చీ కోసమో లక్షలాది ఓట్లు, కోట్లాది ఓట్లు ఉన్నట్లుగా మాలో బిల్డప్ నడుస్తోందన్న మాట వినబడుతోంది. ఉన్న 900 ఓట్ల సాధించడం కోసం నలుగురు పోటీ పడుతుండటం, కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లు మాటల తూటాలు పేల్చుకోవడం. దానికి పెద్ద ఎత్తున మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా కవరేజ్ సాగుతుండటం ఆశ్చర్యం కల్గిస్తుంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవితా రాజశేఖర్ పోటీ పడుతుండటం, వీరిలో ఒకరికి మద్దతుగా నాగబాబు, మరొకరికి నరేష్, ఇలా అధ్యక్ష బరిలో ఉన్న వారికి మద్దతు పలికేవారు తోడు కావడం విడ్డూరంగా ఉంది. ఓ కుటుంబంగా ఉండే మా అసోసియేషన్ లో అందరూ కొరుకునేది అసోసియేషన్ అభివృద్ధికే అయినప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీల పేరుతో ఇంత దిగజారుడు రాజకీయాలు ఎందుకు అనే ప్రశ్న ఉత్పనం అవుతోంది.

ఈ వ్యవహారాలపై ఇటీవల సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ మంచి సూచన చేశారు. అసోసియేషన్ కు సంబంధించి మనం అంతర్గతంగా చర్చించుకోవాలని కానీ బహిరంగంగా చర్చించుకోవడం మంచిదికాదని సూచించారు. మనది రంగుల ప్రపంచం, మనం ఏది మాట్లాడినా సంచలనం అవుతుందన్న బాలకృష్ణ మా ప్రముఖులపై చురకలు వేశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరిగిన వారు అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం సంపాదించలేకపోయారా అని ప్రశ్నించారు.

నాగబాబు మాట్లాడుతూ గతంలో నాయకత్వం వహించిన వారు అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేశారనీ, ఇప్పుడు తాము అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పుకొస్తున్నారు. నాగబాబు గానీ నరేష్ గానీ పోటీ చేయడం లేదు కానీ వీరు మా విషయాలపై బహిరంగంగా మాట్లాడుతుండటం వల్ల అసోసియేషన్ పరువు బజారున పడుతోందన్న అభిప్రాయాన్ని కొందరు సీనియర్ నటులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినీ ప్రముఖులు మా ఎన్నికలను పురస్కరించుకుని నిత్యం మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తూ దూషణలు, విమర్శలు చేసుకోవడం, సెటైర్ లు వేసుకోవడం చూస్తుంటే రాజకీయాలంటే హీనంగా మా రాజకీయం ఉందంటూ వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.


Share

Related posts

కీర్తి సురేష్ మాస్ : అట్టర్ ప్లాప్ రివ్యూ లు – సినిమా సూపర్ హిట్

arun kanna

Today Gold Rate: పసిడి పరుగులకు బ్రేక్.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు..!!

bharani jella

సిబిఐ కేసుపై రాయపాటి ఏమ్మన్నారంటే..

somaraju sharma