తెలంగాణ‌ న్యూస్

Breaking: తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు..! కేసిఆర్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ..!!

Share

Breaking: తెలంగాణలో కేసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ జివో విడుదల చేశారు. ఈ నెల 22 వ తేదీ (ఎల్లుండి) నుండి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Breaking: Telangana govt issued order land value hike
Breaking: Telangana govt issued order land value hike

Read More: Justice NV Ramana: సంచలనాలకు శ్రీకారం చుడుతున్న జస్టిస్ రమణ..!!

ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో భూముల ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భూముల మార్కెట్ విలువ పెరిగితే రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడమే కాక భూ క్రయ విక్రయాల్లో బ్లాక్ మనీ కూడా చెక్ పడుతుంది. రాష్ట్రంల భూముల విలువ ప్రాంతాల వారీగా పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు మార్కెట్ విలువలు కూడా పెరిగాయి.

Breaking: పెరిగిన భూముల విలువ ఇలా..

వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరానికి రూ.75వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఓపెన్ ప్లాట్ కనిష్ట విలువ చదరపు గజానికి రూ.200కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక అపార్ట్ మెంట్ కనిష్ట విలువ చదరపు అడుగుకు రూ.1000కి పెంచారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నా కూడా పెరిగిన ధరనే చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పెంపు ఎందుకంటే..

తెలంగాణలో భూముల విలువను ఎనిమిది సంవత్సరాలుగా సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్త (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం రెట్టింపు అయ్యాయి. నూతన సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెందింది. సాగునీటి వసతి విస్తరించడంతో భూముల విలువ భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఐటీ, ఔషద, పర్యాటకం, స్థిరాస్తి రంగాల్లో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్డు, వివిధ రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో భూముల మార్కెట్ విలువ సవరించాలని గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ వాల్యూయేషన్ సలహా కమిటీ ప్రతిపాదనలు చేసింది.


Share

Related posts

వైసీపీది ఉత్తుత్తి ప్రచారమే..! రెబల్ ఎంపీ తాజా బాంబు..!!

Special Bureau

హాస్పిటల్ బెడ్ లు ఖాళీ లేవు :  కరోనాకోసం హోటల్ రూమ్ లు

arun kanna

అస్సలు, ససేమిరా, ఒప్పుకోను పదహారు నెలల పాలనలో జగన్ ఎప్పుడు ఇంత అసంతృప్తిగా లేరు..!!

sekhar