Ishq : మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది, ఇంద్ర లాంటి సినిమాలతో పాటు మరికొన్ని బ్లాక్ బస్టర్స్ లో నటించిన తేజా సజ్జా హీరోగా మారాడు. ఈ కుర్ర హీరో ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకుంటూ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో వెంటనే తేజా సజ్జా ‘ఇష్క్’ అనే సినిమాలో నటించాడు. ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. చెక్ లాంటి ఫ్లాప్ తర్వాత ఈ యంగ్ బ్యూటి నటించిన సినిమా ఇదే.
ఇక ఈ సినిమా ద్వారా ఎస్.ఎస్. రాజు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. సాత్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించారు. గత కొంతకాలంగా తెలుగులో వీరు సినిమాలు చేయలేదు. మళ్లీ ఇన్నాళ్ళకి ‘ఇష్క్’సినిమాతో తెలుగులో కంబ్యాక్ అవుతూ నిర్మిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ చేశారు.
Ishq : లేటెస్ట్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఎట్టకేలకి థియేటర్లలో ఈనెల 23 నుంచి ఓపెన్ అవుతుండటంతో ‘ఇష్క్’ మూవీని జూలై 30న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పణలో ‘ఇష్క్’ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పటికే రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందిన ‘ఇష్క్’ మూవీనుంచి విడుదలైన ట్రైలర్ అండ్ ప్రోమోలకి ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.