MAA Elections: సినీ పాలిటిక్స్ లో ఎంటరైన జగన్ కి పెద్ద ట్విస్ట్ ..! ‘మా’ లో ఎవరెటు, ఎవరెలా..!?

Share

MAA Elections:  ఏపి రాజకీయాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీపై మళ్లాయి. కొద్ది రోజుల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, యువ నటుడు మంచు విష్ణు ప్యానల్స్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుకు వైసీపీ పరోక్షంగా సహకరిస్తుండటం, మరో వైపు పవన్ కళ్యాణ్ గానీ, నాగబాబు గానీ అంటే జనసేన పరోక్షంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇస్తుండటంతో తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలు ప్రవేశించాయి.

గతంలో తెలుగుదేశం పార్టీ సినీ ఇండస్ట్రీలో పెద్ద పాత్ర పోషించింది కానీ ప్రస్తుతం ఈ పార్టీ నిద్రావస్తలో ఉండటంతో టీడీపీ నాయకులు యాక్టివ్ రోల్ ప్లే చేయడం లేదు. సినీ ఇండస్ట్రీ నుండి టాప్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు మద్దతుగా ఉండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. వారం రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ ఫంక్షన్ నందు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపి మంత్రులు ఇచ్చిన రియాక్షన్ అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలు మా ఎన్నికల్లో ప్రభావం చూపేలా ఉన్నాయి.

MAA Elections politricks
MAA Elections politricks

MAA Elections: కీలకంగా మారిన నిర్మాతల రోల్

పవన్ కళ్యాణ్ సినీ రంగ సమస్యలపై మాట్లాడుతూ మోహన్ బాబును టార్గెట్ చేయడంతో ఆయన తెలివిగా మా ఎన్నికలు అయిపోయిన తరువాత దీనికి సమాధానం చెబుతాను, మీరు మా అబ్బాయికి ఓటు వేయండి అని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఏదైనా మాట్లాడితే కాంట్రివర్సీ అయి విష్ణు ఎన్నికపై ప్రభావం పడుతుందని భావించిన మోహన్ బాబు పవన్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించకుండా తాత్కాలికంగా తప్పించుకున్నారు. అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినీ నిర్మాతలు. మాలో సుమారు సుమారు 900 నుండి 960 మంది ఓటర్లు ఉంటారు. నిర్మాతలు నేరుగా పార్టిసిపేషన్ చేయకపోయినప్పటికీ వాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారి వద్ద పని చేసే సిబ్బంది గానీ, జూనియర్ ఆర్టిస్టులు గానీ మా మెంబర్ షిప్ ఉన్న వారితో నిర్మాతలతో నేరుగా కాంట్రాక్ట్ ఉంటుంది. అటు హీరోల కన్నా ఇటు పోటీ చేసే వారి కంటే నిర్మాతలే కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నిర్మాతలు ఏపి ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నారు. టాప్ ప్రొడ్యూసర్లుగా ఉన్న దిల్ రాజు గానీ, అల్లు అరవింద్ గానీ, బన్నీ వాసు గానీ చూడండి. పవన్ కళ్యాణ్ మొన్న ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సమయంలో దిల్ రాజు ఎదురుగానే ఉన్నారు. ఆ తరువాత మంత్రి పేర్ని నాని మీడియాతో పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దిల్ రాజు ఆయన పక్కనే ఉన్నారు. వీళ్లు రెండు వైపులా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. అటు వైపు టాప్ హీరో. ఆయన సినిమాకు ప్రచారం చేస్తే కలెక్షన్ లు వస్తాయి. ఇటు పక్క ప్రభుత్వం. వీళ్ల చేతిలో అన్నీ ధియేటర్లు, వ్యవస్థ మొత్తం ఉంటుంది. దీంతో ఎవరినీ దూరం చేసుకోకూడదు. వాళ్ల వ్యాపారం దెబ్బతినకూడదు.

Read More: Badvel Bypoll: బద్వేల్ ఉప ఎన్నికలపై కీలక నిర్ణయాన్ని ప్రకటించిన టీడీపీ..! జనసేన బాటలోనే..!!

నాగబాబు సైలెంట్ ఎందుకైనట్లు..?

అయితే ప్రొడ్యూసర్లు వైసీపీకి ఇంత లొంగి ఉండటానికి కారణం ఏమిటి ? అనేది చెప్పుకోవాలంటే నాలుగైదు రోజుల క్రితం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన సందర్భంలో బాక్స్ ఆఫీసు లెక్కులు కూడా చెప్పారు. కొన్ని ఉదాహారణలు కూడా చెప్పారు. ‘సరిలేరు నీకు ఎవ్వరు’, ‘అల వైకుంఠాపురం’ లాంటి సినిమాలకు ఎంత కలెక్షన్లు వచ్చాయి. వాళ్లు ఎంత జీఎస్టీ కట్టారు. నిజానికి ఎంత కట్టాలి. వాస్తవానికి ఎంత కట్టారు, ఎంత ఎగొట్టారు అనే లెక్కలు చెప్పారు. అంటే ప్రభుత్వానికి చిన్న చితకా లెక్కలు తీయడం అంత కష్టమైన పని కాదు. చాలా ఈజీ. దీనికి తోడు ధియేటర్ లలో టికెట్ లు కూడా ప్రభుత్వమే విక్రయించాలి అని అనుకుంటుంది కాబట్టి వ్యవస్థ మొత్తం వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది కాబట్టి బ్లాక్ మనీ వ్యవహారాలు ఆగిపోతాయి. సినిమా వాళ్లు హైప్ చేసి ఇంత కలెక్షన్ వచ్చింది అంత కలెక్షన్ వచ్చింది అని చెప్పడం, ఆ తరువాత నష్టాలు వచ్చాయి అని చూపి తక్కువ టాక్స్ చెల్లించడం రోటీన్ గా మారాయి.

ఈ చర్యలతో అవి ఇక మీదట జరగవు, ఇవన్నీ జరగవు కాబట్టి కశ్చితంగా ప్రభుత్వానికి నిర్మాతలు లొంగి ఉండాల్సిన పరిస్థితి. అందుకే వాళ్లు మంత్రి పేర్ని నానిని కలిశారు. అయితే మా ఎన్నికల్లో వైసీపీ పాత్ర, ప్రొడ్యూసర్ల పాత్ర ఏమిటంటే.. మంచు విష్ణుకు సపోర్టు చేయాలని మంత్రి పేర్ని నాని ప్రొడ్యూసర్లను కోరడం, ప్రొడ్యూసర్లు ఆ తరువాత అంతర్గతంగా మోహన్ బాబుతో మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ పెట్టి మా అసోసియేషన్ మెంబర్ల కు ప్రొడ్యూసర్ల ఛాంబర్ నుండి ఒకరితరువాత ఒకరికి ఫోన్ కాల్స్ వెళుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు జనసేన పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తున్న ప్రకాశ్ రాజ్ కు అనుకూలంగా నాగబాబు ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు. మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో నాగబాబు ఏదో ఒకటి మాట్లాడేవారు, అది నెగిటివ్ గానో పాజిటివ్ గానో పని చేసేది. కానీ ఇప్పుడు నాగబాబు సైలెంట్ గా ఉంటున్నారు. పైగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పై ఇలా మాట్లాడిన తరువాత కూడా నాగబాబు ఏమి మాట్లాడటం లేదు. ఆయనపై కూడా ఈ ప్రభావం ఉందని అర్ధం చేసుకోవచ్చు. మా ఎన్నికల్లో గెలుపు ఎవరిది, ఎవరు ఎలా పని చేస్తున్నారు అనేది లోతుగా ఆలోచిస్తే గెలుపు ఎవరిదో ఊహించవచ్చు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య జరుగుతున్న మా ఎన్నికల్లో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.


Share

Related posts

Keeravani: ఆ స్టార్ డైరెక్టర్స్ సక్సెస్‌లో కీరవాణికి వాటా ఉంటుంది

GRK

బిగ్ బాస్ 4 : ఓటింగ్ లో అభిజిత్ కి టాఫ్ ఫైట్ ఇస్తున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్లు బాగున్నాయ్‌..!

Srikanth A