NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!

రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో నాయ‌కులు తాము గెలుస్తామ‌ని అనుకుంటే.. ప్ర‌త్య‌క్షంగా పాజిటివ్ ప్ర‌చారం చేసుకుంటారు. ఒక్కొక్క సారి గెల‌వ‌డం క‌ష్ట మ‌ని భావించిన‌ప్పుడు లేదా చేతులు ఎత్తేసిన‌ప్పుడు.. త‌మ ప్ర‌త్య‌ర్థి గెలుపు ఖాయ‌మ‌ని అనుకున్న‌ప్పు డు.. రివ‌ర్స్‌లో యాంటీ ప్ర‌చారం చేస్తారు. అంటే.. త‌మ ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌ల‌ను ప్ర‌చారం చేయడం. లేదా.. వారికి లేని పోనివి ఆపాదించి ప్ర‌చారం చేయ‌డం వంటివి కామ‌న్‌గా జ‌రుగుతుంటాయి.

ఇప్పుడు గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే జ‌రుగుతోంది. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున మం త్రి విడుద‌ల ర‌జ‌నీ పోటీ చేస్తున్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున పిడుగురాళ్ల మాధ‌వి బ‌రిలో ఉన్నారు. ఈమెకు గెలిచే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. అన్నీ స‌ర్వేలు ముక్తక‌ఠంతో మంత్రి ర‌జ‌నీ ఓడిపోతుంద‌నే చెపుతున్నాయి.
దీనిపై చంద్ర‌బాబు స‌హా టీడీపీ నాయ‌కులు భ‌రోసాగా ఉన్నారు. ఇక‌, మాధ‌వి స్థానికంగా సుప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి. ఇప్ప‌టికే అనేక సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తున్నారు. ఇలా అన్ని విధాలా ప్ర‌జ‌ల‌కు చేరువైన వ్య‌క్తి. దీంతో ఆమె గెలుపు నామినేష‌న్ల‌కు ముందే ఖ‌రారైందని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీకి అసంతృప్తి సెగ సొంత పార్టీలోనే వెల్లువెత్తుతోంది. ఆమెకు ఇది సొంత నియోజ‌క‌వ‌ర్గం కాదు. ఎక్క‌డో చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చారు. వాస్త వానికి ఇక్క‌డ టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌(సిట్టింగ్ ఎమ్మెల్యే) టికెట్ ఆశించారు. ఆయ‌న‌ను కాద‌ని.. క‌నీసం ఆయ‌న‌తో సంప్ర‌దించ‌కుండానే మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. దీంతో ఆమెకు స‌హ‌క‌రించ‌డంపై మ‌ద్దాలి వ‌ర్గం మౌనంగా ఉంది. ఇది ర‌జ‌నీ ఓటమికి దారి తీసింద‌నే టాక్ వినిపిస్తోంది.

అంటే.. ఒక‌ర‌కంగా.. బీసీ నాయ‌కురాలే అయినా.. విడ‌ద‌ల ర‌జ‌నీకి.. ఇక్క‌డ ఓట‌మి ఖాయ‌మనే వాద‌న సొంత పార్టీ వైసీపీ నేతల్లోనే వినిపిస్తోంది. దీనికి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా తోడైంది. దీంతో విడ‌ద‌ల ర‌జ‌నీ.. మాన‌సికంగా దిగులు పెట్టుకున్నారని పార్టీ నాయ‌కుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో వినిపిస్తోంది. దీంతో ర‌జ‌నీ రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించారు. అంటే.. ప్ర‌త్య‌ర్థి మ‌హిళా నాయ‌కురాలు పిడుగురాళ్ల మాధవి పై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తుండ‌డంతో పాటు ఆమెను వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే ప్ర‌క్రియ‌కు అక్క‌డ వైసీపీ టీం పూనుకుంది.

ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా స‌హా అనుకూల మీడియాల‌లో టీడీపీ అభ్య‌ర్థి పిడుగురాళ్ల మాధ‌వికి వ్య‌తిరే కంగా లేనిపోనివి క‌ల్పించి.. వార్త‌లు రాయిస్తున్నారు. అంతేకాదు.. ఆమె ఆస్తిపాస్తుల ను కూడా బూచిగా చూపించి.. ఎదురుదాడి చేస్తున్నారు. వ్య‌క్తిగ‌త విష‌యాలైన భ‌ర్త వివ‌రాల‌ను కూడా బ‌య‌ట‌కు లాగి.. సాటి మ‌హిళ అన్న విష‌యాన్ని కూడా మ‌రిచిపోయి.. న‌డిరోడ్డుపై యాగీ చేస్తున్న తీరును నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు తీవ్రంగా నిర‌సిస్తున్నారు.

నువ్వు కూడా అనేక త‌ప్పులు చేశావు. నీ భ‌ర్త‌ది ఒక కులం, నీది మ‌రో కులం.. నువ్వు తీసుకున్న లంచా ల గురించి ఎవ‌రికి తెలియ‌దు. పిల్లి క‌ళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా మంత్రి వ‌ర్యా అని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. గెలుపు, ఓట‌ములు అనేవి ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తారు. దీనికి ఎవ‌రూ అతీతులు కారు. ప్ర‌జాక్షేత్రంలో ఓడిపోయిన అతిర‌థ మ‌హార‌థులు ఉన్నారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొని గెలుపు గుర్రం ఎక్కిన అనామ‌కులు కూడా ఉన్నారు. కానీ, ఇంత హీనంగా వ్య‌క్తిత్వాల‌ను రోడ్డున ప‌డేసుకునే రాజ‌కీయాలు మాత్రం ఎవ‌రూ చేయ‌లేదు మంత్రి వ‌ర్యా! అని స్థానిక ప్ర‌జ‌లు ఆక్షేపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పైగా మ‌హిళ‌లు మ‌హిళ‌లు పోటీ చేస్తున్న నియోజక‌వ ర్గంలో ఇంత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది సామాన్య మ‌హిళ‌లే కాదు.. చ‌దువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌లు కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

అంతేకాదు.. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య పోరు ఉండాలే త‌ప్ప‌.. రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి త‌మ బ‌లం ఏంటో చెప్పుకొని ఓట్లు అడిగి గెలిచే స‌త్తా ఉండాలే త‌ప్ప‌.. ఇలా.. రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక దొడ్డిదారిలో రాజ‌కీయాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌సం మంత్రివ‌ర్యా? అనే వాద‌న వినిపిస్తోంది. ఇది అతిగా పెరిగితే.. ఏమో మంత్రి ఓడిపోయే ప‌రిస్థితిలో ఉండి.. ఇలా మాధ‌విపై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారు అనే వాద‌న క‌నుక ప్ర‌జ‌ల్లో బ‌ల ప‌డితే మొత్తానికే ర‌జ‌నీకి మోసం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?