Tollywood Richest Actors: తెలుగు చిత్ర పరిశ్రమ నానాటికీ వృద్ధి చెందుతోంది. బాహుబలి సినిమా టాలీవుడ్ మార్కెట్ భారీగా పెంచింది. పుష్ప. ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు జాతి ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. టాప్ స్థానంలో ఉన్న బాలీవుడ్ ను కిందకు తొక్కి ఇండియన్ సినిమా అంటే మేమే అంటూ ఈ చిత్రాలు యావత్ ప్రపంచానికి చాటి చెప్పాయి. అయితే టాలీవుడ్ మార్కెట్ తో పాటు తెలుగు హీరోల రెమ్యునరేషన్స్ కూడా పెరిగాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్లు, వ్యాపారం, ప్రొడక్షన్ హౌస్లు ద్వారా కూడా ఆస్తులను పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో ఉన్న టాప్-10 మోస్ట్ రిచెస్ట్ హీరోలు ఎవరు..? వారి ఆస్తుల విలువ ఎంత..? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్న హీరోగా కింగ్ నాగార్జున అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. నివేదికల ప్రకారం, ఆయన నికర విలువ రూ. 3010 కోట్లు. అక్కినేని నాగేశ్వరరావుగారి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున.. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా సత్తా చాటుతున్నారు. అలాగే వ్యాపార రంగంలోనూ చక్రం తిప్పుతున్నారు. రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ లాంటి వాటిలో పెట్టుబడులు పెడుతూ ప్రతి ఏడాది నాగార్జున వందల కోట్లు సంపాదిస్తున్నారు.
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ రిచెస్ట్ హీరోల జాబితాలో రెండో స్థానం దగ్గుబాటి వెంకటేష్ కు దక్కింది. దివంగత నిర్మాత డి. రామయనాయుడు తనయుడైన వెంకటేష్ హీరో కాకముందే కోటీశ్వరుడు. వ్యాపారవేత్త కావాలని ఆశపడ్డ ఆయన.. తండ్రి కోరిక మేరకు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి హీరోల పోటీని తట్టుకుని టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో సపరేట్ క్రేజ్ సంపాదించుకున్నారు. నటుడిగా ఫామ్లోకి వచ్చాక వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. రియల్ ఎస్టేట్స్ లలో ఇన్వెస్ట్ చేస్తూ కోట్లకు కోట్లు కూడబెట్టారు. ప్రస్తుతం వెంకటేష్ నికర విలువ రూ. 2200 కోట్లు.
వెంకటేష్ తర్వాత టాలీవుడ్ లో అత్యంత సంపన్నుడుగా చిరంజీవి ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయంకృషి, ప్రతిభతో తెలుగు ఇండస్ట్రీలో నెం.1 హీరోగా ఎదిగిన చిరంజీవి రూ. 1650 కోట్లు విలువ చేసే ఆస్తులను కలిగి ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆయన తనయుడు రామ్ చరణ్ టాలీవుడ్ లో మోస్ట్ రిచెస్ట్ గా హీరో అని నివేదికలు చెబుతున్నాయి. రామ్ చరణ్ నికర విలువ రూ. 1370 కోట్లు. చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. మరియు ప్రముఖ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.
ఇక ఆ తర్వాత స్థానాల్లో రూ. 500 కోట్ల ఆస్తులతో డైలాగ్ కింగ్ మోహన్ బాబు, రూ. 450 కోట్ల ఆస్తులతో జూనియర్ ఎన్టీఆర్, రూ. 380 కోట్ల ఆస్తులతో ఐకాన్ స్టాన్ అల్లు అర్జున్, రూ. 244 విలువ చేసే ఆస్తులతో సూపర్ స్టార్ మహేష్ బాబు, రూ. 230 కోట్ల ఆస్తులతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు రూ. 116 కోట్లు నికర విలువతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నిలిచారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!