Best Murder Mystery Web series: ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. స్టోరీలో ట్విస్టులు, మరియు ఇతర సన్నివేశాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. రానున్న సీన్స్ లో ఏం జరగనుంది అనే క్యూరియాసిటీ తో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టర్స్ సైతం మర్డర్ మిస్టరీలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వచ్చిన సినిమాలు ఇప్పటికే సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక ప్రముఖ ఓటిటి సమస్త సోనీ లీవ్ లోను అలాంటి వెబ్ సిరీస్ కొన్ని ఉన్నాయి. ఆ సిరీస్ అన్ని మొదటి నుంచి చివరి వరకు ఎంతో క్యూరియాసిటీని పెంచుతాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జహానాబాద్:
క్రైమ్ థ్రిల్లర్ మరియు మర్డర్ మిస్టరీ స్టోరీలు అనగానే మనందరి కన్ను ముందుగా బీహార్ పైనే పడుతుంది. జహానాబాద్ కూడా అక్కడి జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీసే. జైలు నుంచి తమ నాయకుడిని విడిపించుకునేందుకు నక్సల్స్ వేసే భారీ ప్లాన్ మరియు దానికి సాయపడే పో కాలేజీ ప్రొఫెసర్.. ఆ ప్రొఫెసర్ తో ప్రేమలో పడే స్టూడెంట్.. ఇలా అనేక ట్విస్టులు మధ్య కొనసాగింది ఈ వెబ్ సిరీస్. ఇక సోనీ లీవ్ ఓటిటి లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది ఈ సిరీస్.
2. ఛార్మీ చోప్రా:
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఛార్మీ చోప్రా. 1931 లో వచ్చిన బ్రిటిష్ నవల ది స్టాఫోర్డ్ మిస్టరీని సిరీస్ గా తెరకెక్కించారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, సో లాంగ్ లోయాలో జరిగే ఓ ఆర్మీ బ్రిగేడియర్ హత్య, దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అని తెలుసుకోవడానికి రంగంలోకి దిగే డిటెక్టివ్ చార్లీ చోప్రా చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ఇక సోనీ లీవ్ ఓటిటిలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది ఈ సిరీస్.
3. అన్దేఖీ:
సోనీలివ్ ఓటిటిలో ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్నాయి. బాగా డబ్బున్న పంజాబీ ఫ్యామిలీ వెడ్డింగ్ లో జరిగే రెండు హత్యల చుట్టూ తిరిగే స్టోరీనే ఈ వెబ్ సిరీస్. ఇక ఈ సిరీస్ సోనీ లీవ్ లో మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి.
4. తనావ్:
కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు, స్పెషల్ టాస్క్ గ్రూప్ మధ్య జరిగే యుద్ధమే ఈ సిరీస్. ఇక ఈ సిరీస్ సోనీ లీవ్ లో నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నాయి.
5. టబ్బర్:
టబ్ అంటే పంజాబీ భాషలో కుటుంబం అని మీనింగ్. ఓ బలమైన రాజకీయ నాయకుడి నుంచి ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన కుటుంబాన్ని కాపాడుకోవడం వెనుక తిరుగుతుంది ఈ కథంశం. ఇక ఈ సిరీస్ సోనీ లీవ్ లో 5వ స్థానాన్ని దక్కించుకున్నాయి.
ఇలా ఈ ఐదు సిరీసే కాకుండా అనేక మిస్టరీస్ సోనీ లీవ్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!