Nara Lokesh: అమరావతి రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సీఐడీ విచారణకు హజరైయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు లోకేష్ విచారణ నిమిత్తం తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో విచారణకు హజరు కావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

నోటీసులపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లోకేష్ ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణ సమయంలో లోకేష్ తో పాటు న్యాయవాదిని అనుమతించాలని, ఉదయం 10 గంటల నుండ సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని ఆదేశించింది. మధ్యాహ్నం ఒ గంట భోజన విరామం ఇవ్వాలని న్యాయస్థానం అదేశించింది.
హెరిటేజ్ రికార్డులు, బ్యాంక్ వివరాల కోసం ఒత్తిడి చేయమని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పదవ తేదీ విచారణకు హజరవ్వాలని లోకేష్ కు హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఇవేళ లోకేష్ సిట్ కార్యాలయానికి చేరుకోగా, సీఐడీ అధికారుల బృందం లోకేష్ ను విచారిస్తొంది. లోకేష్ విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
Telangana Elections: కామ్రేడ్స్ కు కేసిఆర్ ‘హ్యాండ్’ ఇస్తే కాంగ్రెస్ ‘షేక్ హ్యాండ్’ ఇచ్చింది