Brahmamudi అక్టోబర్ 10 ఎపిసోడ్ 223: కావ్య కనిపించకుండా పోయేసరికి దుగ్గిరాల కుటుంబం తో పాటుగా కనకం మరియు మూర్తి కూడా కంగారు పడుతుంటారు. పుట్టింటికి మరియు అత్తారింటికి కూడా చెప్పుకోలేని కొన్ని సమస్యలు స్నేహితులతో చెప్పుకుంటారు, స్నేహితుల ఇంటికి వెళ్ళిందేమో కనుక్కో అని అంటాడు మూర్తి. అప్పుడు కనకం కావ్య స్నేహితురాలికి ఫోన్ చెయ్యగా, ఆమెకి పెళ్ళైన తర్వాత నుండి ఇప్పటి వరకు నాతో టచ్ లో లేదు అని చెప్తుంది.

కావ్య ఆచూకీ కనపడక ఇంటికి తిరిగొచ్చిన రాజ్ :
మరో పక్క కావ్య ఒక గుడిలో కూర్చొని పాత విషయాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. రాజ్ , కళ్యాణ్ మరియు సుభాష్ రోడ్ల మీద కావ్య కోసం వెతుకుతూ ఉంటారు, అలా తెల్లారిపోతుంది. వెతికి వెతికి అందరూ ఇంటికి వస్తారు కానీ, కావ్య జాడ మాత్రం కనిపెట్టలేకపోయారు. అప్పుడే కనకం మరియు మూర్తి తమ కూతురు ఎక్కడికి వెళ్ళింది అని దుగ్గిరాల కుటుంబాన్ని నిలదియ్యడానికి వస్తారు.

దుగ్గిరాల కుటుంబం ని నిలదీసిన కనకం – మూర్తి :
మా కూతురు ఏమైంది అని అడగగా ఏమో మాకు తెలియదు, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని సమాధానం ఇస్తుంది అపర్ణ. అప్పుడే అక్కడ ఒక మూలాన సోఫాలో పడుకొని నిద్రపోతున్న స్వప్న ని చూసి మండిపడుతుంది కావ్య. అవతల నీ చెల్లెలు కనిపించకుండా పోతే, ఇక్కడ నువ్వు ఇంత సుఖంగా నిద్ర పోతున్నావా, అసలు మనిషి పుట్టుక పుట్టావా నువ్వు అని స్వప్న ని నిలదీస్తుంది. నువ్వు రెండు సార్లు కనిపించకుండా పోతే కావ్య కి నిద్ర పట్టలేదు, నువ్వు దొరికే వరకు తన ప్రాణాలను సైతం రిస్క్ చేసింది. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఇంత సుఖంగా ఉన్నావంటే అందుకు కారణం నీ చెల్లి, కనీసం అది కనిపించకుండా పోయింది అనే విషయమైనా నాకు ఫోన్ చేసి చెప్పావా అని అంటుంది కనకం. నా కూతురు ఇలా చెప్పకుండా వెళ్లే మనిషి కాదు, ఇంట్లో నుండి మీరు వెళ్లిపొమ్మని చెప్పినా వెళ్లే మనిషి కాదు, అలాంటి అమ్మాయి కనిపించకుండా పోవడం ఏమిటి అని ఇంట్లో అందరినీ నిలదీస్తుంది కనకం.

కావ్య ఆచూకి కనిపెట్టిన సీతారామయ్య – ఇందిరా దేవి :
రాజ్ ని నిలదీస్తూ నా కూతురిని ఏమి చేసావో చెప్పు బాబు, నీకు ఆమెతో కాపురం చెయ్యడం ఇష్టం లేకపోతే చెప్పు , భార్యగా అంగీకరించకపోయినా పర్లేదు, ప్రాణాలతో మా చేతుల్లో పెట్టు, ఇంటికి తీసుకెళ్ళిపోతాము అని అంటుంది కనకం. అప్పుడు రాజ్ నిజంగా మాకెవ్వరికీ తెలియదు అండీ, ఇంట్లో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది, ఏమైందో ఏమో తెలియక మేము ఊరంతా వెతికి వచ్చాము అని అంటాడు రాజ్. అప్పుడు మూర్తి నమ్మి ఇద్దరు ఆడపిల్లల్ని మీ ఇంటికి ఇస్తే, కాపాడుకోలేని వాళ్ళా నా ఇద్దరు అల్లుళ్ళు. స్వప్న రెండు సార్లు కనిపించకుండా పోయింది, ఇప్పుడు కావ్య కనపడకుండా పోయింది, ఆడపిల్లల్ని సరిగా కాపాడుకోలేని మీకు ఇంత పెద్ద కుటుంబం ఎందుకు అని అంటాడు.

అప్పుడు ఇందిరా దేవి కనకం తో మాట్లాడుతూ గంట క్రితం ఎంతో సంతోషం తో తిరిగిన మీ అమ్మాయి ని చూసి కూడా ఇలా ఇంట్లో అందరి మీద నిందలు వెయ్యడం కరెక్ట్ కాదు. కావ్య ని ఎవరూ ఏమి అనలేదు, ఏ కారణం లేకుండా ఆ అమ్మాయి అలాంటి పనులు చెయ్యదు, ఎదో జరిగింది అని అంటుంది ఇందిరా దేవి. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో సీతారామయ్య మరియు ఇందిరా దేవి కావ్య ఉన్న గుడిలోకి వెళ్తారు. ఇక్కడ కూర్చున్నావ్ ఏంటమ్మా అని అడగగా, రాజ్ రాసిన చిట్టీ ఇస్తుంది కావ్య. అది చదివిన తర్వాత సీతారామయ్య, ఇందిరా దేవి షాక్ కి గురి అవుతారు. ఇంటికి కావ్య ని తీసుకెళ్లిన తర్వాత అపర్ణ ఎక్కడి వెళ్లిపోయావ్ ఎందుకు వెళ్లిపోయావ్ అని కావ్య ని నిలదీస్తుంది. అప్పుడు సీతారామయ్య నేను చెప్తాను అని అంటాడు, తర్వాత ఏమి జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.