NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన నారా లోకేష్

Share

Breaking: ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కలిశారు. ఇవేళ సీఐడీ రెండో రోజు విచారణకు హజరైన లోకేష్ విచారణ ముగిసిన తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి అమిత్ షా నివాసంలో కలిసి చంద్రబాబు అరెస్టు, సీఐడీ కేసుల నమోదు, జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనీ, తనను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. అఖరికి తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రహ్మణిని కుడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.

జగన్ సర్కార్ పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకు లోకేష్ వివరించారు. 73 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడినట్లుగా తెలుస్తొంది. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు గమనిస్తున్నామని లోకేష్ తో అమిత్ షా తెలిపారు. అమిత్ షాను కలిసిన విషయాన్ని లోకేష్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలియజేస్తూ ఫోటోను షేర్ చేశారు. లోకేష్ తో పాటు ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

కేంద్రాన్ని బ్లేమ్ చేసిన వారు సమాధానం చెప్పాలి – పురందరేశ్వరి

రాష్ట్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను అమిత్ షా కు లోకేష్ వివరించారని పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి..కేంద్రంపై నిందలు వేసిన వారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్ షా జీ లోకేష్ కు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు పురందేశ్వరి. ఈ మేరకు పురందరేశ్వరి ట్వీట్ చేశారు.

AP High Court: ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫార్సు చేసిన కొలీజియం


Share

Related posts

Counterfeit Kallu: కల్తీ కల్లు కేసులో బిగ్ ట్విస్ట్ ఇదీ..అయిదుగురు మృతికి కారకుడైన నిందితుడు అరెస్టు..!!

somaraju sharma

Bigg Boss 5 Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్ లో షణ్ముఖ్ కి…సిరి ముందే క్లాస్ పీకినా షణ్ముఖ్ అమ్మ..!!

sekhar

BJP Third List: బీజేపీ మూడవ జాబితా వచ్చేసిందోచ్ .. బాబూమోహన్ అలక తీరినట్లే(గా)..!

somaraju sharma