NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda ramesh : నిమ్మ‌గ‌డ్డ … మ‌ళ్లీ వైసీపీకి దొరికిపోయారా?

CM Jagan VS Nimmagadda ; What Will happen?

Nimmagadda Ramesh : andhra pradesh ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విష‌యంలో మ‌రో కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్సెస్ నిమ్మ‌గ‌డ్డ అన్న‌ట్లుగా జ‌రుగుతున్న మాట‌ల యుద్ధంలో మ‌ళ్లీ కొత్త అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే తాజాగా నిమ్మ‌గ‌డ్డ నిర్వ‌హించిన టూర్ ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాలు.

Nimmagadda Ramesh kumar Power Politics

Nimmagadda Ramesh : నిమ్మ‌గ‌డ్డ ఏం చేశారు

తూర్పు గోదావరి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అధికారులతో నిమ్మ‌గ‌డ్డ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంచాలని అధికారులకు సూచించారు. ఎన్నికలపై ప్రజలకు నమ్మకం కలిగిందని.. ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదన్నారు . అనంత‌రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో సర్పంచ్‌ అభ్యర్ధి భర్త చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. అభ్యర్ధి భర్త మృతిపై కుటుంబానికి పలు అనుమానాలున్నాయని, విచారణ ద్వారా నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. మృతదేహాన్ని కాకినాడ నుంచి వచ్చిన వైద్య నిపుణుల సమక్షంలో పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో శవపంచనామా నిర్వస్తారని, గొల్లలగుంట పంచాయతీ ఎన్నికల అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. మృతుని భార్య అభ్యర్థన మేరకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

వైసీపీ ఏమంటోంది ?

“ఒకేరోజు కొద్ది గంటల సమయంలో తూర్పు గోదావరి జిల్లా గొల్లలకుంటలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటించడాన్ని ఏ విధంగా చూడాలి..?“ అని మంత్రి క‌న్న‌బాబు సందేహం వ్య‌క్తం చేశారు. “ శ్రీనివాసరెడ్డి ఏవిధంగా మరణించాడన్నది ఇంకా పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అలాంటి ఆయన మృతిని రాజకీయం చేసే వారికి ఎస్ఈసీ మద్దతు పలుకుతున్నారనే సందేశం ఇవ్వకూడదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రశాంతంగా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషనర్ అనుకుంటే.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం అయిన నిమ్మగడ్డ గ్రామంలో అంత దౌర్జన్యం జరిగితే అక్కడకు ఆయన ఎందుకు వెళ్ళలేదు. నిమ్మాడ ఘటనపై ఎందుకు స్పందించలేదు..? దానివెనుక ఏమైనా వ్యూహం ఉందా.. “ అంటూ నిమ్మ‌గ‌డ్డ‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యే కామెంట్లు చేశారు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N