JOBS: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,895 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు గానూ డిసెంబర్ 11 వ తేదీ వరకూ అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్ధులకు డిసెంబర్ 27న హాల్ టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ అధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.

ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ సమయం. ఈ సమయంలో నెలకు రూ.15వేల కన్సాలిడేషన్ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 లు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల వయసు లోపు వారు ధరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇతర వివరాలకు ahd.aptonline.in, https://apaha-recrutment.aptonline.in వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ధరఖాస్తులు కూడా ఇదే వెబ్ సైట్ నుండి డౌన్ లోడడ్ చేసుకుని నిర్దేశిత రుసుములను డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి. ధరఖాస్తులను డిసెంబర్ 11వ తేదీ లోపు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
- అనంతపురం 473
- చిత్తూరు 100
- కర్నూలు 252
- వైఎస్ఆర్ 200
- నెల్లూరు 143
- ప్రకాశం 177
- గుంటూరు 229
- కృష్ణా 120
- పశ్చిమ గోదావరి 102
- తూర్పు గోదావరి 15
- విశాఖపట్నం 28
- విజయనగరం 13
- శ్రీకాకుళం 34
CM YS Jagan: ‘విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే’