NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Panchayat polls : ఏపిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Panchayat polls : రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 6.30గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరుగనున్నది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,723 గ్రామ పంచాయతీల్లో నేడు తొలి దశ పోలింగ్ జరుగుతుండగా 7,506 మంది సర్పంచ్ స్థానాలకు పోటీలో ఉన్నారు. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు.

Panchayat polls : ap local body elections
Panchayat polls : ap local body elections

మొత్తం నేడు జరగాల్సిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. గుంటూరు, చిత్తూరు  జిల్లాలో నిలిపివేసిన ఎకగ్రీవాలను ఎస్ఈసీ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించింది.  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి సారిగా నోటాను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కోవిడ్ పేషంట్ లకు పిపిఈ కిట్లతో చివరి గంట సేపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని పలు గ్రామాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలకు వెంటనే పోలీసులు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకువస్తున్నారు.

Panchayat polls : ap local body elections
Panchayat polls : ap local body elections

పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N