Prabhas Donation: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది దొడ్డ మనసు..! ఏపి వరద బాధితులకు భారీ విరాళం..!!

Share

Prabhas Donation: ఇటీవల ఏపిలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. దాదాపు 8500 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ ముందుకు వచ్చారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు ప్రకటించగా ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు తదితర సినీ హీరోలు రూ.25లక్షల చొప్పున విరాళాలను ప్రకటించారు. అయితే దాదాపుగా హీరోలు రూ.25 లక్షలు వంతున విరాళాలను ప్రకటించగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరూ ఊహించని విధంగా కోటి రూపాయలు ప్రకటించి తనది దొడ్డ మనసు అని మరో సారి రుజువు చేసుకున్నారు. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన ప్రభాస్ .. త్వరలో దీనికి సంబంధించిన చెక్కును సీఎం కార్యాలయానికి పంపనున్నారు.

Prabhas Donation 1 crore rupees to ap cm relief fund
Prabhas Donation 1 crore rupees to ap cm relief fund

 

Prabhas Donation: కరోనా సమయంలోనూ..

రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ తరువాత వచ్చి సాహోతో మరింత పాపుల్ అయ్యారు. సినిమాల్లో ఫైటింగ్ లు, రోమాన్స్ చేయడమే కాదు ఆపదలో ఉన్న వారికి అప్పన్న హస్తం అందించడంలోనూ ప్రభాస్ బాహుబలే గానే నిలుస్తున్నారు. గతంలో కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల వంతన విరాళం అందించడమే కాక ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ మువీ రాధేశ్యామ్ తో అభిమానులు, ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

Read More: AP Govt: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..! ప్రైవేటు లే అవుట్ వ్యాపారులకు బిగ్ షాక్..!!


Share

Related posts

YS Jagan: స్థానిక ఎన్నికల వేళ..! జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం షాక్..!!

Muraliak

AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!

somaraju sharma

హైద‌రాబాద్ జ‌నాల‌కు షాక్‌… ఆమె డైరెక్టుగా కేటీఆర్‌కే చెప్పేసింది

sridhar