AP Politics: బీజేపీ మారింది – సీబీఐ మారుతుంది..! సీబీఐలో ఈ మార్పులు చూసారా.!?

Share

AP Politics: దేశంలో వ్యవస్థలను నియంత్రిస్తున్నది ఎవరు..? దేశంలో వ్యవస్థలను ఏడేళ్లుగా ఒక్కోటీ అదుపులోకి తీసుకుంటున్నది ఎవరు..!? దేశంలో నియంతృత్వ ధోరణిలో పాలనను చక్కబెడుతున్నదెవరు..!? వీటన్నిటికీ టపీమని సమాధానం చెప్పేయొచ్చు.. బీజేపీ అని..! కానీ అందుకు తగిన ఆధారాలు, ఉదాహరణలు చూపించడమే కాస్త కష్టం… కానీ ఏపీ సీఎం జగన్ కేసుల విషయంలో మాత్రం బీజేపీ రెండు, మూడు రకాల గేమ్స్ ఆడుతున్నట్టు అర్ధం చేసుకోవచ్చు.. “ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి సీబీఐ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అంటూ వాదిస్తూనే.. అతను సాక్షులను ప్రభావితం చేస్తారన్నది.. మరి ఇదే సీబీఐ జగన్ బెయిల్ రద్దు కోరుతూ రెబెల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్లో మాత్రం నోరు మెదపలేదు.. సో.. ఈ నాలుగు నెలల్లో సీబీఐలో వచ్చిన స్పష్టమైన మార్పుని స్పష్టంగా గమనించవచ్చు.. దీనికి కారణం.. కర్త, కర్మ, క్రియ కూడా ఎవరో గ్రహించవచ్చు”..!

AP Politics: సీబీఐ అప్పుడలా.. ఇప్పుడిలా..!?

నాలుగు నెలల క్రితం అక్రమాస్తుల కేసులో జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ ఓ విధంగా ఆయనకు అనుకూలంగా వ్యవహరించింది. కానీ అదే సీబీఐ ఇప్పుడు జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా హైకోర్టులో వాదించింది. జగన్మోహనరెడ్డి కేసులకు సంబంధించి రోజువారి విచారణ జరుగుతోంది. అయితే వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు కోరుతూ జగన్మోహనరెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే సీబీఐ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కారణంగా కేసు విచారణలో వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలనీ హైకోర్టును అభ్యర్ధించారు. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపగా సీబీఐ షాకింగ్ కామెంట్స్ వినిపించింది.

AP Politics: CBI Changed by BJP Influence..?
AP Politics: CBI Changed by BJP Influence..?

సీీబీఐ చేసిన కామెంట్స్ జగన్మోహనరెడ్డి, ఆయన తరపు న్యాయవాదులు కూడా ఊహించి ఉండరు. సీబీఐ చెప్పిన వాదనల ప్రకారం “ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనీ, ఇప్పుడు అత్యున్నత హోదాలో ఉన్నారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తారన్న అనుమానాలు ఉన్నాయని.. కావున వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వవద్దు” అంటూ వాదించింది. “ఇప్పటికే ఈ కేసు పది సంవత్సరాాల నుండి విచారణ జరుగుతూనే ఉంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి. విచారణ ఎంత త్వరగా పూర్తి చేయాలని ఆయన సహకరించాలి. ఆయన సహకరించాలంటే రోజు వారి విచారణకు హజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది”. జగన్మోహనరెడ్డి తరపు న్యాయవాది గతంలో చేసిన వాదనల మాదిరిగానే తన క్లయింట్ సీఎం హోదాలో ఉన్నారు. పరిపాలనా బాధ్యతలలో ఉన్నందున వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు..!

AP Politics: CBI Changed by BJP Influence..?
AP Politics: CBI Changed by BJP Influence..?

అప్పుడేం చేసిందంటే..!?

నాలుగు నెలల క్రితం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయన బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే .. ఆనాడు సీబీఐ ఎటువంటి వాదనలు వినిపించలేదు. అఫిడవిట్ ను దాఖలు చేయడానికి ముందుకు రాలేదు. కోర్టు నిర్ణయానికే సీబీఐ వదిలివేసింది. కానీ అదే సీబీఐ ఇప్పుడు సాక్షులను ప్రభావితం చేస్తారని అఫిడవిట్ వేసింది. వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. త్వరలో వెల్లడించే హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 11 సీబీఐ కేసులకు ట్రయిల్ నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారంలో మూడు నాలుగు రోజులు సీఎం జగన్ కోర్టు వాయిదాలకు హజరుకావాల్సి ఉంటుంది. వీటికి తోడు కొన్ని కేసుల్లో జగన్ హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ లు దాఖలు చేసి ఉన్నారు. అవి విచారణ దశలో ఉన్నాయి. సో.. సీబీఐ అంటే కేంద్ర హోమ్ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఆ శాఖకి బాస్ అమిత్ షా.. ఆయనే బీజేపీకి కూడా పరోక్ష బాస్.. సో.. దీనిలో రాజకీయ కోణం మనమేమి బూతద్దం పెట్టి వెతకక్కర్లేదు. ఈజీగా కనిపిస్తుంది..!


Share

Related posts

Bigg boss Lasya : మహిళల గొప్పదనం ఇది.. లాస్య మంజునాథ్ మహిళా దినోత్సం స్పెషల్ వీడియో?

Varun G

ఐపీఎల్ : హైదరాబాద్ ఓడితే కోల్‌కతకి సంబరాలు!!

Special Bureau

బిగ్ బాస్ 4: అతనే ఎంటర్టైన్మెంట్ అంటున్న లాస్య..!!

sekhar