న్యూస్

Twitter: న్యూ ఫీచర్స్ తో ట్విట్టర్…!

Share

Twitter New features: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటి అయిన ట్విట్టర్ కు చాలామంది యూజర్లు ఉన్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుండి సినీ సెలెబ్రిటీలు, ప్రముఖుల సైతం అందరూ కూడా ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని అందరికి తెలిసేలాగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు. చూడడానికి చిన్న పిట్ట ఆకారంలో ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సింబల్ కు ఎనలేని క్రెజ్ వచ్చేసింది. ఈ ట్విటర్ సింబల్ చాలామందిని ఆకర్షిస్తుంది. ట్విట్టర్ లో అకౌంట్ ఉంటే చాలు మనకు కావలసిన వారిని ఫాలో అవ్వవచ్చు. వారి చేసిన పోస్ట్లు కానివ్వండి, ట్వీట్లు కానివ్వండి మనకి చూసేందుకు వీలు ఉంటుంది. ఎన్నో కోట్ల మంది మేధావులు సైతం ఉపయోగించే ఈ ట్విట్టర్ వారికి మరింత వెసులుబాటు కలిగించే క్రమంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ఇలా కూడా ట్వీట్స్ వినొచ్చట :

మరి ఆ నిర్ణయం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. ఇప్పటివరకు ట్వీట్లను కేవలం చదవడం మాత్రమే చేస్తున్నాము. కానీ ఇకమీదట ట్వీట్లను చదవడంతో పాటు ఆడియో రూపంలో కూడా వినవచ్చును అంట. ట్విటర్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆడియో ట్వీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఆడియో ట్వీట్లు అందుబాటులోకి రావాలి అంటే మరి కాస్త సమయం పడుతుంది అని ట్విటర్ వెల్లడించింది. మొదటగా
దీనిని ప్రయోగాత్మకంగా యాపిల్ ఐఫోన్ లలో పరీక్షించనున్నారు. అది సక్సెస్ విజయవంతం అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వీటినీ అందుబాటులోకి తీసుకుని రావాలని ట్విటర్ యోచిస్తోంది.

ఆడియో ట్వీట్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే :

ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే ముందుగా మీరు ట్విట్టర్ లో ఉండే కంపోజ్ అనే అప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏవైతే ట్వీట్ చేయాలనుకుంటున్నామో దానిని పూర్తిగా రికార్డ్ చేయాలి. ఇలా రికార్డైన సందేశాన్ని మనం మెసేజ్ ఎలా అయితే పోస్ట్ చేస్తామో అలాగే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం పెట్టిన ఆడియో ట్వీట్ ను మనల్ని ఫాలో అయ్యే వాళ్లు వినవచ్చు. అలాగే వీటికి తిరిగి రిప్లై కూడా ఇవ్వవచ్చు. ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే చదువు రాని వారు కూడా ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది అనివిశ్లేషకులు అంటున్నారు.


Share

Related posts

ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సమస్య పరిష్కారానికి టయోటా చూపిన పరిష్కారం ఇదే..

bharani jella

Sushanth Singh Case : సుప్రీం కోర్టులోనూ సుశాంత్ సింగ్ సోదరికి చుక్కెదురు

somaraju sharma

బిగ్ బాస్ 4 : హారిక లోపల ఉంటే… ఆమె అన్న, అమ్మ ఏం చేశారో చూడండి..! ఎమోషనల్ అయిపోయిన హారిక

arun kanna