Visakha: మేఘాద్రిగడ్డ డామ్‌లో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపాలపట్నం బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన హేమంత్ (35) డామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హేమంత్ గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనారోగ్య కారణాల వల్ల మానసికంగా ఇబ్బంది పడటంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం హేమంత్ ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, చెప్పులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ వద్ద కనిపించడంతో అనుమానం వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఇవేళ ఉదయం హేమంత్ మృతదేహం లభ్యమైంది.

ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మృతుడు హేమంత్‌కు భార్య, బాబు, పాప ఉన్నారు. హేమంత్ మృతి వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.