Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ (గురువారం) వరకూ చంద్రబాబును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ హైకోర్టు ఇంటీరియమ్ ఆర్డర్స్ ఇచ్చింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. కేసులో విచారణకు సహకరిస్తారని హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయంపై సీఐడీ , హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది.
ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మరో పక్క ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటీ వారెంట్లపై రైట్ అఫ్ ఆడియన్స్ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. గత వారం రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ కోర్టు విచారణ చేపట్టింది. పీటీ వారెంట్లపై విచారణ చేపట్టబోయే ముందు తమ వాదనలు వినాలని చంద్రబాబు తరపున న్యాయవాదులు రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ వేశారు. సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇవేళ వాదనలు వినిపించారు. కాగా, రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
Singareni Elections: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ .. మళ్లీ ఎప్పుడు జరుగుతాయంటే..?