NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆగ‌స్టు 25న తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం ..భక్తులు నేరుగా, వ‌ర్చువ‌ల్‌గా పాల్గొనే అవ‌కాశం

Advertisements
Share

తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 25వ తేదీ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం జరుగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మ వారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్ర‌తాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.

Advertisements

 

భ‌క్తులు నేరుగా వ్ర‌తంలో పాల్గొనేందుకు ఆగ‌స్టు 18వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆల‌యం వ‌ద్ద గ‌ల కుంకుమార్చన కౌంటర్‌లో ఆగస్టు 24 వ తేదీ ఉదయం 9 గంటలకు కరెంట్‌ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగ‌స్టు 18న ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది.

Advertisements

వ‌ర్చువ‌ల్ టికెట్లు పొందిన భ‌క్తులకు ఆగ‌స్టు 26వ తేదీ నుండి 90 రోజులలోపు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఈ కారణంగా అభిషేకం, వ‌స్త్రాలంక‌ర‌ణ సేవ‌, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజ‌ల సేవ‌, బ్రేక్ ద‌ర్శ‌నం, వేద ఆశీర్వ‌చ‌నం సేవలను టీటీడీ రద్దు చేసిందని తెలిపారు.

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!


Share
Advertisements

Related posts

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

రైతు అంటాడు… కథలు చెబుతాడు ; రైతుల పోరాటంపై పవన్ వింత వైఖరి

Special Bureau

Varun Tej: ఈసారి మెగాస్టార్ ఉండాల్సిందే..లేకపోతే వరుణ్‌కు కష్టమే..?

GRK