NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉమ్మ‌డి గుంటూరులో టీడీపీ బోణీ ఇక్క‌డే.. 25 ఏళ్ల త‌ర్వాత విన్ అవుతోందిగా..!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అంతే బ‌ల‌మైన నాయ‌కులు కూడా ఉన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని సింప‌తీ కూడా టీడీపీకి క‌లిసి రానుంది. ఇలా.. మొత్తంగా చూసుకుంటే.. టీడీపీకి దాదాపు జిల్లా వ్యాప్తంగా సానుకూల ప‌వ‌నాలే వీస్తున్నాయి. అయితే.. ఈ మొత్తం నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మ‌రింత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా బాప‌ట్ల క‌నిపిస్తోంద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ పోటీ చేస్తున్నారు.

వ‌ర్మ అంటే.. బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో కొట్టిన పిండి అనే టాక్ ఉంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టిక్కెట్ రేసులో చివ‌రి వ‌ర‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు ఆ అదృష్టం చిక్కిన‌ట్టే చిక్కి చేజారింది. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఇంట్లో అయినా ఆయ‌న పేరు తెలియ‌ని వారు అంటూ ఎవ‌రూ లేరు. అంతేకాదు.. పేద‌లు, నియోజ‌క‌వ‌ర్గంలోని ఎస్సీలు, వైసీపీని అభిమానించే రెడ్డి సామాజిక వ‌ర్గంలోనూ న‌రేంద్ర వ‌ర్మ వైపే మొగ్గు క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోంది.

దీనికి వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ కృషితోపాటు.. మ‌రింత ఎక్కువ‌గా ప్ర‌జ‌ల ద‌న్ను ఆయ‌న‌కు ఉంద‌ని చంద్ర‌బా బు నిర్ధారించుకోవ‌డ‌మే. దీంతో వ‌ర్మ‌కు మ‌రింత బ‌లం స‌మ‌కూరిన‌ట్ట‌యింది. ఇక‌, ఇత‌రకొన్ని నియోజ‌క‌వ ర్గాల మాదిరిగా.. ఇక్క‌డ అసంతృప్తులు.. ఎగ‌స్పార్టీలు అనేవి లేకపోవ‌డం గ‌మ‌నార్హం. అంద‌రూ క‌లిసి వ‌స్తు న్నారు. వేగేశ్న వ‌ర్మ వ‌ర్గంగా టీడీపీ నాయ‌కులు ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ప్ర‌చారం చేస్తున్నారు. అయితే .. నోటిఫికేష‌న్‌కు ఇంకా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేయ‌నున్నారు.

మొత్తంగా చూస్తే.. న‌రేంద్ర వ‌ర్మ‌కు ఇక్క‌డ చాలా వ‌ర‌కు పాజిటివిటీ ఉండ‌డ‌మే కాదు.. మార్పును కోరుతు న్న జ‌నాలు కూడా పెరుగుతున్నారు. ఇక్క‌డ రెండు ద‌ఫాలుగా కోన ర‌ఘుప‌తి విజ‌యం ద‌క్కించుకున్నా రు. కానీ, ఆయ‌న వ‌ల్ల ఇక్క‌డివారికి ఒరిగింది ఏమీ లేద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో స‌హ‌జంగా ఉండే వ్య‌తిరేక‌తే.. ఆయ‌న‌ను వెంటాడుతోంది. ఇది.. వ‌ర్మకు ఉన్న సొంత బ‌లాన్ని మ‌రింత పెంచింది. ఒక్క చాన్స్ ఆయ‌న‌కు ఇచ్చి చూడాల‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీంతో ఈ ద‌ఫా.. టీడీపీ ఉమ్మ‌డి గుంటూరులో గెలిచే తొలి స్థానం ఇదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju