ఏపీలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా.. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో తల్లి సాయివర్ణిక (25) సహా ఇద్దరు చిన్నారులు తనీష్ (7), తరుణేశ్వర్ (1) గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.