32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎం చేస్తాయన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Share

రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎం చేస్తాయని టీటీడీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. జనసేన, టీడీపీ అధినేతలు ఇటీవల భేటీ అయిన విషయంపై ఆయన శనివారం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకనే పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం ఆరాటపడుతున్నానని చెబుుతున్నారనీ, టీడీపీ అధినేత చంద్రబాబుతోనే పవన్ పొత్తుకడుతున్నారని అన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైసీపీ వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. సంక్షేమ పథకాలే మళ్లీ జగన్ ను సీఎం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

yv subba reddy

 

సీఎం జగన్ ను మూడు ముక్కల సీఎం అని విమర్శించడం సరికాదని వైవీ అన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఇదే సందర్బంలో తిరుమలలో రూమ్ ధరలు విపరీతంగా పెంచేశారు అంటూ జరుగుతున్న ప్రచారంపైనా వైవీ వివరణ ఇచ్చారు. సామాన్య భక్తులకు అవసరమైన రూమ్ ల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. వీఐపీల రూమ్ ల ధరలు మాత్రమే పెరిగాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాదాపు రూ.120 కోట్లు వెచ్చించి రూమ్ లను రీ మోడలింగ్ చేశామని తెలిపారు. సాధారణ గదులు కూడా రీ మోడలింగ్ చేసి ఆ మేరకు మాత్రమే ధరలు పెంచామని వైవీ వివరణ ఇచ్చారు.

రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల అంశంపై శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన యువశక్తి సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సభలో వైసీపీపై పవన్ చేసిన విమర్శలపై వైసీపీ నేతలు, పలువురు మంత్రుుల ఘాటుగా కౌంటర్ లు ఇచ్చారు. తాాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఆ అంశంపై మాట్లాడటంతో పాటు టీటీడీ రూమ్ ల ధరలపై జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు.

సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఇలా..


Share

Related posts

ఎపి లాజిస్టిక్స్ హబ్

somaraju sharma

పవన్ కళ్యాణ్ సినిమా కి ఇలాంటి టైటిల్స్ ఆ.. ట్రెండ్ కి తగ్గట్టు లేవే ..?

GRK

అక్టోబర్ 25 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma