NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Prakasam barrage : కరువు తీర్చిన కృష్ణమ్మ !

Prakasam barrage కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని భూమిని బంగారం చేసిన ప్రకాశం బ్యారేజ్ 60 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 1954 మార్చి 1న ప్రకాశం బ్యారేజ్ పునర్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు చేతులమీదుగా శంకుస్థాపనo పెడితే, 1957 నాటికీ బ్యారేజి నిర్మాణం పూర్తయి, నీలం సంజీవరెడ్డి ప్రారంభం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఏడాదిలో అవసరం అయ్యే మూడు పంటలకు నీరు అందించే బాధ్యతను బ్యారేజీ తీసుకుంది.

Prakasam barrage బ్యారేజీ బహు బాగు!

ప్రకాశం బ్యారేజ్ 60 వసంతాలు పూర్తి చేసుకోవడం మాట అటుంచితే ఎప్పటినుంచో బ్యారేజీ వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదికి భారీగా వరద వచ్చినప్పుడల్లా మేట వేసిన ఇసుక ను తొలగించి బ్యారేజీకి సరికొత్త రూపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం పెరగడంతోపాటు, వరద ప్రభావాన్ని దిగువ ప్రాంతాలకు తగ్గించవచ్చు.

ముఖ్యంగా ముంపు ప్రాంతాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని కోసం 102 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, 13 కిలోమీటర్ల మేర బ్యారేజి ఎగువన పూడిక తీస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 50 లక్షల టన్నుల పూడిక వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం వ్యయాన్ని ఏపీఎండీసీ భరిస్తుంది. పూడికతీత వల్ల ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం 3.071 మెరుగవుతుందని, సుమారు మూడు నుంచి ఐదు మీటర్ల మేర పూడిక తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏ ప్రాంతాల్లో అధికంగా పూడిక ఉందో గమనించి పరిశీలించిన తర్వాత, పనులను మొదలు పెడతారు.

ఎంతో కథ ఉంది!

** కళ్లెదుటే నీరు ఉన్న, వచ్చిన నీరంతా సముద్రం పాలు కావడంతో వ్యవసాయానికి అనువుగా ఉండేది కాదు. 1852 ముందు కృష్ణా డెల్టా అంతా కరువుతో అల్లాడే పోయేది. 1833 ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు తో ఈ ప్రాంతంలో 40 శాతం మంది మరణించడంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని భావించింది.

సరిగ్గా ఈ సమయంలోనే గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించి, ఆ ప్రాంతంలో సాగు నీరు అందేలా చర్యలు చేపట్టడంతో, అదే పద్ధతిలో కృష్ణా నది మీద కూడా మ్యారేజ్ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. 5.80 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో , 1.53 కోట్ల నిర్మాణ వ్యయంతో బ్యారేజీ నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది.

** కాటన్ తో పాటు మరో బ్రిటీషు అధికారి లేక్ వచ్చి బ్యారేజి నిర్మాణం పనులు ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది అనేది పరిశీలించారు. దాని తర్వాత విజయవాడ సమీపంలో బ్యారేజీ నిర్మిస్తే అనువుగా ఉంటుందని దాని మీద బ్లూప్రింట్ సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తయ్యే సమయానికి కాటన్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు.

 Prakasam barrage
Prakasam barrage

** కాటన్ తర్వాత ఆయన మేనల్లుడు జనరల్ చార్లెస్ ఎ. ఓర్ ప్రకాశం బ్యారేజీ ను పరుగులు పెట్టించారు. 1852 నాటికి ఆరడుగుల ఎత్తులో, 45 కోట్లతో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం మొదటిదశలో పూర్తయింది. అయితే ఇది సరిగ్గా వందేళ్లకు కృష్ణా నదికి వచ్చిన తీవ్రమైన వరదల్లో కొట్టుకుపోయింది. అప్పట్లో ఆగమేఘాల మీద బ్యారేజ్ నిర్మించడంతో పాటు, అలాంటి అనువైన పద్ధతులు అవలంబించడం పోవడంతో బ్యారేజి వందేళ్లకు పాడైంది. దీన్ని మళ్లీ పునర్నిర్మించేందుకు టంగుటూరి ప్రకాశం పంతులు పునుకున్నారు.

** అప్పటి వరద ఉధృతికి ప్రాజెక్టుకు ఒక్కొక్కటి గండి పడటంతో వాటిని నివారించేందుకు అప్పటి ప్రాజెక్టు అధికారి వేపా కృష్ణమూర్తి ప్రయత్నించారు. ఒక చిన్న స్టీమర్ లో ఇసుక బస్తాలు సిమెంటు బస్తాలు కంకర వేసుకొని వెళ్లి గండి పుడ్చాలని ప్రయత్నించారు. అయితే వరద ఉధృతి పెరగడంతో కృష్ణమూర్తి తోపాటు నలుగురు ప్రాజెక్టు అధికారులు మృతి చెందారు.

** ప్రకాశం బ్యారేజ్ పునర్నిర్మాణంలో దాదాపు అందరూ తెలుగువారే పాలుపంచుకున్నారు. ప్రథమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సుబ్రహ్మణ్యం, విజయవాడ సర్కిల్ సూపర్నెంట్ ఇంజనీరుగా నరసింహారావు పని చేస్తే వారి టీమ్ లోని మిగిలిన వారి అధికారులు సైతం తెలుగు వారే కావడం విశేషం. అప్పట్లో ప్రాజెక్టుకు 2. 38 కోట్లు వ్యయం అయింది.

** ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కృష్ణా తూర్పు డెల్టా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలుగా విభజించి సాగునీరు అందిస్తోంది. 13.08 ఎకరాలకు దీని ద్వారా నీరు అందుతుంది. రెండు డెల్టా ల పరిధిలో 14 కాలువల ద్వారా సాగునీటితో పాటు తాగు నీరు అందుతుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, ఏలూరు, బందరు వంటి పట్టణాలతోపాటు సుమారుగా 1400 గ్రామాలకు తాగునీరు ను ఇవి అందిస్తున్నాయి.

** కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో బందరు కాలువ 77.80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ, 1,37,786 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే కృష్ణా పశ్చిమ డెల్టాలో భాగమైన కృష్ణా పశ్చిమ గట్టు కాలువ 74.20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 1,55,344 ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు అందుతోంది.

** మ్యారేజ్ 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ వేదికగా అప్పటి అధికారులను సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన 18 మంది సెక్షన్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిని సన్మానం చుకుని, చిరునవ్వే ప్రకాశం బ్యారేజ్ కు ఓ గొప్ప శాల్యూట్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు పూడికతీత పనులతో బ్యారేజీ కొత్తకళ సంతరించుకుంటే, మరో వైపు నిర్మాణంలో పాలు పంచుకున్న ధీరులను సన్మానించుకుని విజయ గర్వంతో తలపైకి ఎత్తుకుని నిలబడింది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?