NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కి దొరికిపోయిన విజ‌య‌సాయిరెడ్డి ?

VijayasaiReddy: Targeted in Politics RRR Case

ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా విరుచుకుప‌డే సంగ‌తి తెలిసిందే. వైఎస్ఆర్‌సీపీ నేత‌ల‌పై సైతం టీడీపీ నేత‌లు కామెంట్ల ప‌రంప‌ర కొన‌సాగిస్తుంటారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ నేత‌లు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌మ్మిన‌బంటు విజ‌య‌సాయిరెడ్డిని ఇరికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయం కోరిన హిందువులను నిర్బంధించి,అన్యమత అధికారులకు పెత్తనం కట్టబెడుతన్నదని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.

విజ‌య‌సాయిరెడ్డి క‌ల‌క‌లం …

రామతీర్థంలో శ్రీరాముని తల నరికి వేసిన సంఘటనలో ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన టీడీపీ నేత ఆరోపించారు. రామతీర్థంలో సంఘటన జరిగిన నాలుగు రోజులు పట్టించుకోని ప్రభుత్వం ఈ నెల రెండవ తేదీన తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించడానికి సిద్దపడగానే వైఎస్ఆర్‌సీపీ ఆందోళన చెందిందని తెలిపారు. అందకే ఆ రోజు చంద్రబాబు కంటే ముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్ళి సాక్ష్యాలు చెరిపి వేశారని తెలిపారు. చంద్రబాబుకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారని, తీరా కొండపైకి వెళ్లిన తరువాత గుడి తలుపులు మూసేశారని చెప్పారు.

మ‌తం పేరుతో…..

రామ‌తీర్థం ఘ‌ట‌న‌ల‌పై సీబీఐ విచారణ జరపాలని చంద్రబాబు కోరితే సిఐడి విచారణకుఆదేశించి అన్య మతస్తుడైన ఎడిజి సునీల్ కుమార్ ను దర్యాప్తు అధికారిగా నియమించారని చెప్పారు. మంగళవారం సంఘటన స్ధలంలో పర్యటించిన సునీల్ కుమార్ విగ్రహ విధ్వంసం పక్కా ప్రణాళికతో జరిగిందని చెప్పడం గమనార్హం అన్నారు. దీనిని బట్టి ఈ కేసును తప్పదారి పట్టించి రాజకీయ రంగు పూసే ప్రయత్నం జరుగుతున్నదని భావించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి రిపోర్టునే సునీల్ కుమార్ దర్యాప్తు రిపోర్టుగా కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు. కాగా మంగళవారం బిజెపి నేతలు , స్వాములను కొండపైకి వెళ్ళకుండా నిర్బంధించడంలోను కుట్ర దాగివుందన్నారు. ఎంపి విజయసాయి రెడ్డిని కొండపైన, గుడిలో యధేచ్ఛగా తిరగనిచ్చిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబును గుడిలోకి, మిగిలిన వారిని కొండపైకి అనుమతించక పోవడమం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju