NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakha : వైసీపీలోకి చేరిన మంత్రి గంటా ప్రధాన అనుచరుడు.. ! మంత్రి అవంతి అలక..!!

Visakha : గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల వేళ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీ నుండి నేతలు, కార్యకర్తలను వైసీపీ ఆహ్వానిస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత కాశీ విశ్వనాధం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాశీ విశ్వనాధంతో పాటు మరి కొందరు కూడా వైసీపీలో చేరారు.

Visakha : ganta fallower vishwanath joins ycp
Visakha : ganta fallower vishwanath joins ycp

మంత్రి అవంతి అలక

గంటా అనుచరుడు కాశీ విశ్వనాధం వైసీపీలో చేరికపై జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినా విజయసాయిరెడ్డి కాశీ విశ్వనాధంను పార్టీలో చేర్చుకోవడంపై మంత్రి అవంతి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన అలకబూనడం వల్లనే ఈ చేరిక కార్యక్రమానికి గైర్హజరు అయ్యారని వార్తలు వస్తున్నాయి. గతంలో గంటాతో అవంతి శ్రీనివాస్ తో సన్నిహిత సంబంధాలు గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. గంటా వైసీపీ చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందుకే గంటా వైసీపీలో చేరికపై చాలా కాలంగా వార్తలు వచ్చినా ఆయన పార్టీలో చేరడం సాధ్యపడలేదు. నేడు గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాధం చేరికను అవంతి తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అవంతి అలిగి ఈ కార్యక్రమానికి హజరుకాకపోవడం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది.

Visakha : ganta fallower vishwanath joins ycp
Visakha : ganta fallower vishwanath joins ycp

Visakha : గంటా చేరికపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల చాలా మంది ఆకర్షితులు అవుతున్నారనీ, టీడీపీ నుండి ఇంకా వలసలు ఉంటాయని విజయసాయిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారనీ, ఇంతకు ముందు పార్టీలో చేరికపై  తను కొన్ని ప్రతిపాదనలు పంపారని విజయసాయిరెడ్డి అన్నారు. దానిపై ఎమ్మెల్యే ముందుకు వస్తే పార్టీ అధినేత జగన్ ఆమోదిస్తే తప్పకుండా పార్టీలో చేర్చుకుంటామన్నారు. విశాఖ మేయర్ అభ్యర్థి ఎవరు అనే దానిపై మాట్లాడుతూ ఎన్నికల అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడిస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు.

మంత్రి అవంతితో వ్యక్తిగత విభేధాలు లేవు

తన చేరికను మంత్రి అవంతి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదని కాశీ విశ్వనాధం అన్నారు. తనకు  అవంతితో వ్యక్తిగత విబేధాలు ఏమీ లేవన్నారు. తాను మంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకుంటాానని పేర్కొన్నారు. పార్టీలో కలిసి పని చేస్తానన్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N