పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. పార్ధసారధి అస్వస్థతతో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పార్ధసారధిని పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండె పోటు వచ్చినట్లు నిర్ధారించారు. అశోక్ నగర్ లోని టాప్ స్టార్ ఆసుపత్రి నందు పార్ధసారధికి చికిత్స చేశారు. వెంటనే యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు.
Advertisements

ప్రస్తుతం పార్ధసారధి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పార్ధసారధి అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పార్ధసారధి త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నారు.
Advertisements
Advertisements