Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో,కృష్ణ అగ్రిమెంట్ పెళ్లి గురించి, రేవతి అడగాలనుకుంటుంది. మురారి కనపడకుండా బయటికి వెళ్లడం. కృష్ణ కంగారు పడుతూ ఉంటుంది. ముకుందా మురారి ఇద్దరు కలిసి వెళ్లారని రేవతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో,కృష్ణని రేవతి, నీది అగ్రిమెంట్ పెళ్లి అన్న విషయం ఎందుకు దాచి పెట్టావు. అంటే రేపు పెళ్లిగడువు తీరిపోగానే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా, నన్నుకూడా వదిలేసి వెళ్ళిపోతావా,ఇంతకాలం మురారితో నటించినట్టు నాతో కూడా నటించావా కృష్ణ అని అడుగుతుంది. దానికి కృష్ణ, లేదా అత్తయ్య నేను మీతో నటించలేదు. నేను మీతో పాటే ఉంటున్నాను అని అంటుంది. మిమ్మల్ని నిజంగానే ప్రేమించాను. మీరు నాకు దైవంతో సమానం అని అంటుంది. అయితే ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళనని మాటివి కృష్ణ అని అంటుంది రేవతి. దూరం నుంచి మధు అలేఖ్య చూస్తూ ఉంటారు. అదే టైం కి కృష్ణ అత్తయ్య అత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది. దాంతో రేవతి కలలో నుంచి ఇలలోకి వస్తుంది. ఇప్పటిదాకా జరిగింది కళ నేను నిజంగానే కృష్ణ అడిగేసాను అనుకున్నానే అని అనుకుంటుంది. కృష్ణఏమైందో అత్తయ్య ఏంటి నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా అని అంటుంది. ఏం లేదు కృష్ణఅని అంటుంది.మీరు కూడా మీ అబ్బాయి లాగా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా ఉంటారు నాకు అలా ఉండడం చేతకాదు అత్తయ్య అని అంటుంది. పై అధికారులతో మాట్లాడి మురారి ఎక్కడున్నారో మీ మామయ్య చేత కనుక్కుంటాను అని చెప్పి రేవతి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari : కృష్ణ పెళ్లి గురించిల నిలదీసిన రేవతి.. ముకుంద విషయంలో కృష్ణ అనుమానం…
ముకుంద ఇంటికి వస్తుంది
ముకుంద ఒకటే ఇంటికి వస్తుంది. అదే టైంకి కృష్ణ వచ్చారు వీళ్లు అనుకుంటూ కిందకు వస్తుంది. రేవతి ముకుందని ఆపుతుంది. ఎక్కడికి వెళ్లారు అని అంటుంది. నన్ను ఇప్పుడేమి అడక్కుండా అత్తయ్య అంటుంది ముకుంద. దేనికి వెళ్లారు ఎక్కడికి వెళ్లారు మీకోసం మేము ఎంత కంగారు పట్టామో తెలుసా అని అంటుంది రేవతి. నేను వెళ్ళినందుకా లేదంటే మురారితో కలిసి వెళ్లినందుకు మీ కంగారు అని అంటుంది
ముకుంద. ఎంత అడిగినా కానీ ముకుంద ఎక్కడికి వెళ్ళిందో చెప్పదు. ఇందాకట్నుంచి నిన్ను అడుగుతున్నాను ముకుందా ఎక్కడికి వెళ్లారు అని అంటుంది రేవతి. ముకుంద ఏడుస్తూ నిలబడి ఉంటుంది. కృష్ణ వచ్చే ముకుందా ఎక్కడికి వెళ్లారు నువ్వు కేసిపి సార్ కలిసి ఆకాష్ వెతకడానికి వెళ్లారా.ఆకాష్ ఆచూకీ తెలిసిందా అని అంటుంది కృష్ణ. లేదు కృష్ణ మా అమ్మకి సీరియస్ గా ఉందంటే వెళ్లాను ఆ టైంలో ఎవరైనా తీసుకెళ్లాలో తెలియదా మురారి ని తీసుకొని వెళ్ళాను. తనకి ఏమైంది ఆనీ కృష్ణ అడుగుతుంది. మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు అని ముకుందా ఏడుస్తుంది. అదే టైం కి మురారి వస్తాడు. ఎలా ఉంది ఇప్పుడు అత్తయ్యకి అని అడుగుతాడు. ముకుందేమీ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైందమ్మా అత్తయ్య సీరియస్ గా ఉందా అని రేవతిని అడుగుతాడు. అవున్రా చేయి దాటిపోయినట్టుంది అందుకే ముఖం ఏడుస్తుంది అని అంటుంది రేవతి.నా గురించి ఏమైనా కంగారు పడిందా అమ్మ కృష్ణ అని అడుగుతాడు. ఎందుకు కంగారు పడదు నువ్వంటే దానికి ఇష్టం ఉంది కదా ఈ ఫీలింగ్స్ లేవు అనుకున్నావా అని అంటుంది రేవతి. అలా ఏం లేదమ్మా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. రేవతి మనసులో టైం వచ్చినప్పుడు చెప్తాను రా నీ పని కృష్ణపని ఇద్దరినీ అడిగేస్తాను అని అనుకుంటుంది.

కృష్ణ కోపం
మురారి రూమ్ కి వెచ్చడానికి కృష్ణ పైకి వెళ్లిఅలిగి కూర్చొని ఉంటుంది.మురారి రాగానే మాట్లాడకుండా ఉంటుంది.ఏమైంది కృష్ణ నామీద కోపమా అని అంటాడు.నాకెందుకు కోపం అని అంటుంది.అయితే అలిగావా అని అంటాడు.ఎవరి మీద అలగాలి ఎందుకు అడగాలి అని అంటుంది. మురారి చెయ్యి పట్టుకుంటాడు. వదలండి ఎసిపి సార్ అని అంటుంది కృష్ణ. ఎందుకు వదలాలి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని అంటాడు. నేనేమీ అనుకోవట్లేదు అని అంటుంది. సరే అయితే అని చేయ వదిలేసి వాష్ రూమ్ కి వెళ్తారు. ఇదేంటి నేను చేయి ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు. నేను తనకోసం కాఫీ తీసుకొని చెకోర పక్షులు ఎదురు చూస్తుంటే తనేమో ఏమీ లేకుండా వెళ్ళిపోతాడా, రాణి చెప్తాను, ముందు నాకు సారీ చెప్పాలి ఆ తర్వాత, ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది చెప్పాలి.ఇంకోసారి ఇలా చేయను నాకు మాట ఇవ్వాలి. ఇంక మూడు ఇది తన తోను డైరెక్ట్ గా చెప్తాను అని అంటుంది. అయినా ఇప్పుడు వచ్చే కృష్ణ అంటే సరిపోతుందా, నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడు చెప్పాలి.

అలేఖ్య మందు తాగుతుంది.
మధు మందు బాటిల్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఎవరు తీసారు అబ్బాయి ఇక్కడే పెట్టాను కదా అనుకుంటాడు. అంతలోనే మధుని ఎవరో పిలుస్తారు. భవాని పెద్దమ్మ వచ్చిందా ఏంటి అందరిలా కేకేస్తున్నారు అని అనుకుంటాడు మధు. మళ్లీ మధు మధు అని వినపడుతుంది. ఏదో తేడా వాయిస్ లా ఉందే, ఇది అలేఖ్య వాయిస్ లాగా ఉంది అని అనుకుంటూ ఉండగానే అలేఖ్య వస్తుంది. అప్పటికే అలేఖ్య మందు తాగేసి ఉంటుంది. ఆనందంతో నువ్వు తాగేసావా నీకేం పోయేకాలం వచ్చింది అని అంటాడు మధు. తాగితే కిక్ ఎక్కుతుందా లేదా అని చెప్పి తాగాను అని అంటుంది అలేఖ్య. నాలుగు పీకితే ఆటోమేటిక్గా మామూలుగా అయిపోతావు అని అంటాడు మధు. అలేఖ్య ముకుందా మురారిని ప్రేమిస్తుంది అని మధుతో చెబుతుంది. నీకెలా తెలుసు అని అంటాడు మధు. మురారి డ్రాయింగ్ ముకుంద రూములో ఉంది అని చెప్తుంది. నీకు ఇదే తెలుసు నేను డైరెక్ట్ గా ప్రపోజ్ చేయడమే చూశాను అని అంటాడు మధు. కదా నాక్కూడా ముకుందా మురారి మధ్య ఏదో ఉందని తెలుసు కానీ ఈ విషయం దేవతలకు చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఇది తాగితే ధైర్యం వస్తుంది అని చెప్పావు కదా అందుకే మందు తాగి నిజం చెబుదాం అనుకున్నాను. మరి రేవతికి చెప్పావా అనిఅడుగుతాడు మధు.చెప్పలేదు ఆల్రెడీ నేను కొట్టింది కదా అందుకే నన్ను కూడా కొడుతుందేమోనని భయపడుతున్నాను అని అంటుంది అలేఖ్య. సరేలే పద ఇకనుంచి మందు బాటిల్ నీకు కూడా కనపడకుండా దాచి పెట్టాలి అని అనుకుంటాడు మధు.

ఏంటి నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంది కృష్ణ. ఈ అయినంతట ఆయనే వచ్చి పలకరించే దాకా నేను పలకకూడదు అని అనుకుంటుంది. ఏంటి తను కావాలనే చేస్తున్నాడా నేను చాలా సీరియస్ గా ఉంటాను అని సీరియస్ గా ఫేస్ పెడుతుంది. కృష్ణన్ చూసి మురారి నవ్వుకుంటూ దగ్గరకొచ్చి కూర్చుంటాడు. అబ్బో మేడంకి కోపం వచ్చినట్టుంది అని అంటాడు. కృష్ణ ఎలా చేస్తే అలానే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. కృష్ణ బెట్టి చేస్తున్నావా అని అంటాడు. కోపంగా కూడా ఉన్నట్టున్నావు. అవును అంటుంది కృష్ణ. ఎందుకో చెప్తావా అని అంటాడు. మీకు తెలీదా అంటుంది కృష్ణ. నీకు చెప్పకుండా వెళ్ళిపోవడం తప్పే కానీ నాకు తప్పలేదు. కమిషనర్ గారు ఫోన్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేశాను అని అంటాడు మురారి. ఫోన్ చేయలేదని నేను ఎంత ఫీల్ అయ్యాను అని అంటుంది కృష్ణ. నువ్వు నాకు చాలా సార్లు సారీ చెప్పాలి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు మురారి. తప్పు చేసిన వాళ్ళు ఎలా దరిదిద్దుకోవాలో కూడా చెప్పాలా అని అంటుంది కృష్ణ. నువ్వు జగమంటివి కృష్ణానంటాడు మురారి. ఏమన్నావ్ అంటుంది. నువ్వు చాలా మంచి దానివి అంటున్నాను కృష్ణ అని అంటాడు. సారీ చెప్పి బుజ్జగించిన తర్వాత కూడా ఇలా ఉంది ఏంటి అనుకుంటాడు మురారి. సారీ చెప్పు బుజ్జి ఇస్తే సరిపోతుందా, వారిని ఎలా విజిగించాలో తెలియదు అని అనుకుంటుంది. ఇంకెప్పుడూ ఇలా చేయండి కృష్ణ అని ఒట్టేస్తాడు. చెప్పకుండా వెళ్ళినందుకు కోపం వచ్చింది కదా, బాధేసింది అంటుంది కృష్ణ. అయితే మళ్లీ సారీ కృష్ణ అంటాడు. ఇక సారీ చెప్పక్కర్లేదు అని అంటుంది కృష్ణ. మీరు చెప్పకుండా వెళ్ళినందుకు నేను బాధపడ్డాను. అప్పుడప్పుడు ఇలాంటి చెరుకులు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి కృష్ణ అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ముకుంద వాళ్ళ డాడీ తో ఫోన్లో మాట్లాడుతూ నన్ను అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్దాం అమెరికాకి తీసుకెళ్దాం అని అంటుంది. సరే అమ్మ తీసుకెళ్దాం లే అని అంటాడు. రేవతి అత్తయ్య మీకు ఫోన్ చేసిందా అని అడుగుతుంది. చేసిందమ్మా అని అంటాడు. ఏమైందమ్మా నువ్వు ఇంట్లో చెప్పకుండా వచ్చావా అని అంటాడు. లేదు నాన్న చెప్పకుండా వచ్చాను అని ఫోన్ పెట్టేస్తుంది.

Brahmamudi Serial జూన్ 10th 119 ఎపిసోడ్:స్వప్న ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు.. మండపం లో స్వప్న కోసం వెతుకుతున్న కావ్య
రేపటి ఎపిసోడ్లో, రేవతి వల పౌర్ణమి చాలా విశేషమైన రోజు, ఈరోజు భార్యకి భర్త మెట్టెలు దొరుకుతాడు అని అంటుంది. మురారి చేత కృష్ణకు మెట్టెలు తొడిగిస్తుంది రేవతి. అది చూసి ముకుంద చాలా కోపంగా ఉంటుంది.చూడాలి ముకుందా ఏమి చేయనుందో…