YSRCP: రీసెంట్ గా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితులైన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇవేళ బాపట్ల జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పరిశీలకులు, నాయకులతో సమావేశమైయ్యారు. బుధవారం బాపట్ల కోన భవన్ లో విడివిడిగా నేతలతో సమావేశాలు నిర్వహించారు. దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులైన తరువాత మొదటి సారిగా విజయసాయి రెడ్డి బాపట్ల జిల్లా నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఉదయం రాష్ట్ర మంత్రి మేరగు నాగర్జున (వేమూరు) ఎంపీ మోపిదేవి వెంకటరమణ(రేపల్లె), ఆమంచి కృష్ణ మోహన్(పర్చూరు), బాచిన కృష్ణ చైతన్య(అద్దంకి), కరణం వెంకటేష్, బలరాం (చీరాల) లతో విజయసాయిరెడ్డి విడివిడిగా సమావేశం అయ్యారు.

అలాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మండలి ఛీఫ్ విప్ ఉమా రెడ్డి వెంకటేశ్వర్లు తదితరులతో సమావేశం అయ్యారు. వారి నుండి నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితులు, ఆయా నియోజకవర్గలలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల కమిటీ నియమాకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నియోజక వర్గ స్థాయిలో ద్వితీయ, తృతీయ స్థాయి నాయకుల మధ్య సమన్వయం తదితర అంశాలపైనా ఆయన ఆరా తీశారు. అనంతరం జిల్లాలోని నియోజక వర్గాల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. గురువారం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమీక్ష సమావేశం విజయసాయిరెడ్డి నిర్వహించనున్నారు.
ఈనెల 18న బెజవాడలో హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్