NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఈనెల 18న బెజవాడలో హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

Advertisements
Share

పర్యాటక రంగంలో అత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన “హయత్ ప్లేస్” విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్  ను ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నట్లు హోటల్ హాయత్ ప్లేస్ చైర్మన్ రామిశెట్టి వీరాస్వామి తెలిపారు. హోటల్ హయత్ ప్లేసును ప్రారంభించవలసిందిగా కోరుతూ బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో హయత్ ప్లేస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సాయి కార్తీక్, జనరల్ మేనేజర్ చింతల రామకృష్ణతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన్నట్లు చైర్మన్ వీరాస్వామి తెలిపారు.

Advertisements

విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల ఇఎస్ఐ ఆసుపత్రి సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ ఫోర్త్ స్టార్ హోటల్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలలో హయత్ ప్లేస్ స్టార్ హోటల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో మూడు హయత్ ప్లేస్ గ్రూప్ హోటల్ లను దిగ్విజయంగా నిర్వహిస్తూ పర్యాటకుల అభిమానాన్ని చూరుగొంటున్నామన్నారు.

Advertisements

విభజన అనంతరం ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ లో  తొలి సారిగా విజయవాడ నగరంలో హయత్ ప్లేస్ హోటల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు హయత్ ప్లేస్ ను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, హోటల్స్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారని రామిశెట్టి వీరాస్వామి తెలిపారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్


Share
Advertisements

Related posts

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు హైకోర్టు ఝలక్

sarath

“సర్కారు వారి పాట” సినిమా కి కరోనా ఎఫెక్ట్..!!

sekhar

బిగ్ బాస్ వేస్ట్ ప్రోగ్రాం అంటూ ఆ లేడీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్లు..!!

sekhar