NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : జగన్ కారణంగా ఎన్ డీ ఏలోకి తెలుగుదేశం? ఇదొక వెరైటీ లాజిక్ మరి

YS Jagan : ఏపి లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైతే సీఎం వైఎస్ జగన్ ను కేంద్రంలోని బీజెపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతుందని ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తుంది. ఏపి లోని రాజకీయ పరిస్థితులను బీజెపీ అధిష్టానం గమనిస్తూ ఉందనీ ఒక వేళ వైసీపీ గ్రాఫ్ తగ్గితే టీడీపీ తో మళ్లీ ఎన్ డీ ఏ దోస్తాన్ చేస్తుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో అనూహ్య విజయంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజెపీ – జనసేన కూటమి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉంది. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ వెనుకబడిపోతే బీజేపీ రానున్న రోజుల్లో టీడీపీకి దగ్గర అయ్యే అవకాశం కూడా ఉందని వారు ఊహగానాలు చేస్తున్నారు. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ టీడీపీ మాత్రం విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.

YS Jagan : tdp re enter in to nda?
YS Jagan : tdp re enter in to nda?

YS Jagan : ఏకగ్రీవాల కోసం నేతల పాట్లు

ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ నేతలు ఏకగ్రీవాల కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల నుండి పోటీ నెలకొని ఉండటంతో ఏకగ్రీవాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదన్న మాట వినబడుతోంది. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఏకగ్రీవాల కోసం విస్తృతంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చూట్ల మాత్రం ఏకగ్రీవాలు అవుతున్నాయి,. ఈ సారి ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే భారీగానే నామినేషన్ లు దాఖలు అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

ప్రధానంగా అధికార పార్టీలో నాయకులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి వారు గ్రామాల్లో అధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. ఇదే అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏకగ్రీవాలకు ఇచ్చే ప్రోత్సహాక బహుమతిని జనాభా దామాషా ప్రకారం రూ.5 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకూ పెంచారు. అయినప్పటికీ గ్రామాల్లో పోటీ వాతావరణమే కనబడుతోంది. ఇప్పటి వరకూ మాత్రం వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని ప్రభుత్వం అండగానే ఉంటోంది. కేంద్రానికి వైసీపీ సహకారం అందిస్తూనే ఉంది. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!