NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఈడీ కేసులో లేరు.. సాయిరెడ్డికి శాపమా – వరమా..!?

YSRCP: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై సీబీఐ, ఈడీ కేసులు ఉండగా తాజాగా హౌసింగ్ అక్రమాలపై కొత్తగా మరో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నాడు కాంగ్రెస్ పార్టీని ఎగర్తించి బయటకు వెళ్లడం వల్లనే అక్రమంగా కేసులు బనాయించారని మొదటి నుండి వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్మోహనరెడ్డి పై ఉన్న సీబీఐ, ఐడీ కేసుల్లో ఏ 2 గా విజయసాయి రెడ్డి ఉండగా ఇప్పుడు కొత్తగా నమోదు అయిన కేసులో ఆయన పేరు లేకపోవడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

YSRCP: Vijaya Sai reddy name disappears in housing scam case
YSRCP Vijaya Sai reddy name disappears in housing scam case

 

Read More: heroine chandini: మాజీ మంత్రి పై ఓ సినీ నటి సంచలన ఆరోపణలు..తమిళనాట హాట్ టాపిక్ ఇదే..

కేంద్రంలో బీజేపీతో ఉన్న పరిచయాల కారణంగా విజయసాయి రెడ్డి లాబీయింగ్ చేసుకోవడం వల్ల ఆయన పేరును  హౌసింగ్ బోర్డు అక్రమాల కేసులో పెట్టలేదా లేక వారి దర్యాప్తులో అయన పేరు రాలేదా అన్న విషయంపై వైసీపీలో విజయసాయి అనుకూల, వ్యతిరేక వర్గాల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కారణం ఏమిటంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయసాయి రెడ్డి చాలా కాలంగా ఢిల్లీలో ఆ పార్టీ వ్యవహారాలు చూస్తూ కేంద్రంలోని పలువురు పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారనే మాట వినబడుతోంది. ఆ కారణంగానే గతంలో బీజేపీ  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పెద్ద ఎత్తున ఏర్పడిన వివాదం ఒక్క సారిగా చల్లారిపోయిందని అంటున్నారు. నాడు విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా కూడా వేస్తానని ప్రకటించిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. అంటే కేంద్రంలోని బీజేపీ పెద్దల నుండి కన్నా లక్ష్మీనారాయణకు సూచనలు రావడం వల్లనే ఆయన విజయసాయిరెడ్డిపై కోర్టులో దావా వేయలేదని ఓ వర్గం వారు చెప్పుకుంటున్నారు.

YSRCP: Vijaya Sai reddy name disappears in housing scam case
YSRCP Vijaya Sai reddy name disappears in housing scam case

అయితే ఈ జరిగిన పరిణామాన్ని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై చర్చ జరుగుతోంది. తన పేరు కేసులో ఉండి విజయసాయి రెడ్డి పేరు లేకపోవడంపై జగన్ ఏ విధంగా అర్థం చేసుకుంటారు, పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా  లేక నెగటివ్ గా చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే వైసీపీ ఓ వర్గం మాత్రం హౌసింగ్ కు సంబంధించి అగ్రిమెంట్ లు జరిగిన సమయంలో విజయసాయి రెడ్డి లేకపోవడం వల్లనే ఆ పేరు చేర్చలేదనీ, నాడు వైవీ సుబ్బారెడ్డి ఉండటం వల్ల అయన పేరును పెట్టారని అంటున్నారుట. అయితే విజయసాయి రెడ్డి వ్యతిరేకులు మాత్రం ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే పేరు లేకుండా చేసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి ఈ కేసులో పేరు లేకపోవడం వరమా శాపమా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పిడింది.

author avatar
Srinivas Manem

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N