Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ Super Star Krishna ఈ బిరుదుకు ముందు ఆయనకు ‘నటశేఖర’, ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ అనే బిరుదులు ఉండేవి. అయితే.. ప్రముఖ సినీ వారపత్రిక ‘శివరంజని’ ఓ సందర్భంలో తెలుగు సినిమాల్లో ‘సూపర్ స్టార్’ అనే బిరుదు ఎవరికి అనే ఓటింగ్ నిర్వహించింది. అందులో తిరుగులేని ఓటింగ్ ‘కృష్ణ’కు వచ్చింది. దీంతో తెలుగులో ఆయన సూపర్ స్టార్ కృష్ణ అయిపోయారు. అదీ ఆయన క్రేజ్. ఓపక్క పౌరాణికంలో ఎన్టీఆర్, సాంఘీకంలో ఏఎన్నార్ రాణిస్తుంటే తానొచ్చి స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకున్నారు. కృష్ణ ఒక్క హీరోగా మాత్రమే కాదు.. అన్ని శాఖలపై పట్టున్న ఓ టెక్నీషియన్. తెలుగులో సినిమాల్లో పలు మార్పులకు ఆయన నాంది పలికారు. నేడు ఆయన 78వ పుట్టినరోజు.
కృష్ణ హీరోగా నటించిన సినిమాలు 325 పైమాటే. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డు ఉన్న హీరో మరొకరు లేరు.. ఇక రారు కూడా. రోజుకు ఐదారు షిఫ్టులతో వేగంగా అనేక సినిమాలు చేశారు. 1966లో తొలి సినిమా తేనెమనసులు విడుదలైతే.. 1976కి 100 సినిమాలు.. 1986కి 200 సినిమాలు.. 1996కి 300 సినిమాలు.. ఇలా దాదాపు ప్రతి పదేళ్లకు వంద సినిమాలు చేసేశారు. అంతటి స్పీడ్ ఆయన సొంతం. ఓదశలో ఏలూరులో 21 ధియేటర్లుంటే.. అన్ని ధియేటర్లలోనూ కృష్ణ సినిమాలే ఆడాయి. ఇదొక రికార్డు. నిర్మాతలకు ఇబ్బంది లేని హీరో. కథ బాలేదని తెలిసినా మొహమాటానికి చేసిన సినిమాలు, నిర్మాతలకు నష్టం వస్తుందంటే రెమ్యునరేషన్ కూడా తీసుకోని హీరో ఆయన.
Read More:Bollywood-Satyadev: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్ హీరో.. ఉమామహేశ్వరరావు..!!
తెలుగు సినిమాలో అనేక మార్పులు, ప్రయోగాలు చేశారు. తొలి కౌబాయ్, తొలి సినిమా స్కోప్, తొలి ఈస్ట్ మన్ కలర్, తొలి 70ఎంఎం, తొలి భారీ బడ్జెట్.. ఇలా ప్రతి విభాగంలో ఆయన ఖర్చుకు వెనుకాడక ప్రయోగాలు చేసి తెలుగులో ఆద్యుడు అయ్యారు. తెలుగు సినిమాకు ఇంత చేశారు కాబట్టే ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కృష్ణ అభిమాన సంఘాల లెక్క అప్పట్లోఓ రికార్డు. ఆయన నటవారసులుగా మహేశ్, మంజుల.. సినిమాల్లో ఉన్నారు. మహేశ్ ఆయన లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. కుటుంబానికి కూడా టైమ్ కేటాయించక తెలుగు సినిమాకు ఎంతో చేసిన కృష్ణ.. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!