YS Jagan case: కౌంటర్ ధాఖలుకు చివరి అవకాశం ఇచ్చిన సీబీఐ కోర్టు

Share

YS Jagan case: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1వ తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలునకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో ఇదే చివరి అవకాశం అంటూ సీబీఐ కోర్టు విచారణను మరో సారి వాయిదా వేసింది.

cbi court on YS Jagan case
cbi court on YS Jagan case

 

Read More: CBI: బిగ్ బ్రేకింగ్.. సీబీఐ కొత్త బాస్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్

వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపి రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది. లాక్ డౌన్ తదితర కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలియజేయగా, సీబీఐ నుండి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. లాక్ డౌన్ ఉంటే మెయిల్ ద్వారా అయినా అఫిడవిట్ దాఖలు చేయవచ్చనీ, ఉద్దేశపర్వకంగా అఫిడవిట్ దాఖలునకు జాప్యం చేస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామనీ, జూన్ 1వ తేదీ  కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణను చేపడతామని సీబిఐ కోర్టు పేర్కొంది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : సుజాత వస్తూ వస్తూ అతని పై తన పగ అంతా తీర్చేసుకుందిగా….

arun kanna

Anchor Suma : మీరు మీ భర్తలను చూసి భయపడతారేమో? నేనైతే భయపెడతా? యాంకర్ సుమ షాకింగ్ కామెంట్స్?

Varun G

బీహార్ లో గెలిచి.. దేశాన ఓడి..! పార్టీకి కొత్త కష్టాలు మొదలు..!!

Muraliak