Samantha: దేత్తడి హారిక ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన మొదటి యూట్యూబ్ వీడియో గా సమంతా తో చిట్ చాట్ చేసిన వీడియో చేసింది.. ఈ వీడియోలో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్, నాగ చైతన్య, కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానమిస్తూ బోలెడన్ని సీక్రెట్ లను రివీల్ చేసింది..!! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది..!!

Read More: వ్యాక్సిన్ వేయించుకోండి.. బ్లూషీల్డ్ పొందండి
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన హారిక జనవరిలో ముంబైలో జరుగుతున్న సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అక్కడ ఒక రోజు సమంతతో మాట్లాడేందుకు పర్మిషన్ తీసుకుంది.. అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, కరోనా టెస్ట్ లో నెగిటివ్ వచ్చిన తర్వాత హారిక ను లోపలికి పంపించారు.. ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ను కలిసింది. అప్పుడే షూటింగ్ జరుగుతున్న సమంతా తో ఒక ఫోటో దిగింది.. ఆ తరువాత సమంతతో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి ముచ్చటించింది.. ఈ సినిమాలో రాజీ పాత్ర కోసం తను ఎంతగానో కష్ట పడ్డానని, ఈ సిరీస్ లో చాలా ఫైట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన అప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా సమంత బాధపడినట్లు వివరించారు.. సమంత వెజిటేరియన్ అయినప్పటికీ చాలా ఫిట్ గా ఈ రోల్ చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు చేతి గురించి చాలా కేర్ తీసుకుంటానని చెప్పింది. హారిక అడిగిన రాపిడ్ ఫైర్ లో జిమ్ – యోగ లో 2 ఇష్టమైన అని చెప్పారు. బాలి – మాల్దీవ్స్ లో మాల్దీవ్స్ ఇష్టమని చెప్పారు.. స్కూబా డైవింగ్ అంటే చాలా ఇష్టమట సమంతాకి. సన్ సెట్ ను ఎక్కువగా ఇష్టపడతారట. షార్ట్ హెయిర్ – లాంగ్ హెయిర్ లో ఎల్లప్పుడూ షార్ట్ హెయిర్ కే ఇంపార్టెన్స్. సెల్ఫీ – ఆటోగ్రాఫ్ లో ఆటోగ్రాఫ్ ఇవ్వడానికే ఇష్టపడతారట. కాల్ – టెక్స్ట్ లో టెక్స్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారట. ట్విట్టర్ – ఇంస్టాగ్రామ్ లో ఇంస్టాగ్రామ్ ని ఎక్కువ ఫాలో అవుతారట. కొత్త ఫోనా లేదా కొత్త బట్టలు అంటే కొత్త బట్టలకే తన ఛాయిస్. మౌంటెన్స్ – ఓషియన్స్ లో ఓషియన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారట.. చివరిగా ఫామిలీ మెంతులు సస్పెన్స్ గురించి అడగగా సమంతా కూడా సైలెంట్ గా వెళ్ళిపోయారు..