బిగ్బాస్ ఇంటిలో ఖరాఖండిగా మాట్లాడే వారు మాత్రమే ఎక్కువ రోజులు నిలుస్తారు. అంతకుముందు కౌశల్ అయినా…. మొదటి సీజన్ శివబాలాజీ అయినా మొన్నటి రాహుల్ సిప్లిగంజ్ అయినా మనసులో ఏది ఉంటే బయటకు అదే మాట్లాడేస్తారు…. మిగతావారు హర్ట్ అవుతారా లేదా అన్నది తర్వాత సంగతి వారు న్యాయం అనుకున్న దానిపై గట్టిగా నిలబడ్డారు.
ఆమె కి అన్నీ అర్హతలే….
అయితే ఈసారి కంటెస్టెంట్లతో అటువంటి లక్షణాలు ఉన్న ప్రధమ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అరియానా విషయానికి వస్తే ఆమె టాస్క్ ల విషయంలో తన 100% ఇస్తుంది. అలాగే ఇంటి సభ్యులతో తాను అనుకుంటున్నది క్లియర్ గా వ్యక్తపరుస్తుంది. ఏదైనా పొరపాటు ఉంటే క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది…. లేదంటే వారికి తన వాయిస్ వినిపించి వదిలేస్తుంది.
నాగార్జున కే సవాల్….
ఇక ఈ శనివారం ఎపిసోడ్ విషయానికి వచ్చేసరికి సోహెల్–అరియానా మధ్య గత వారం జరిగిన గొడవ గురించి నాగార్జున విచారించాడు. అప్పుడు సోహెల్ అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి…. ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ ను డిస్టర్బ్ చేసినందుకు ఐస్ ముక్కలను మాత్రమే వాడొద్దని నేను చెప్పాను అని అన్నాడు. అందుకు అరియానా నేనేమీ సొంతగా ఐస్ ముక్కలు తీసుకొని రాలేదు… బిగ్బాస్ పంపించినా…. ఇక అవి వాడకపోతే బిగ్బాస్ ఎందుకు పంపించినట్లు అని తిరిగి ప్రశ్నించింది.
మొహమాటమే లేదు..!
దీనికి నాగార్జున, సోహెల్ ఇద్దరి దగ్గర సమాధానం లేకుండా పోయింది. అలాగే మోనాల్ టాస్క్ లో భాగంగా నాపై అన్నీ పోశారు…. నేను ఒప్పుకుంటాను కానీ అందులో మానవత్వం లేదు అని అన్నప్పుడు… అరియానా మానవత్వం గురించి టాస్క్ లో నేను ఆలోచించను నాకు టాస్క్ ఇచ్చారు అందులో 100% నేను గెలవడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ మానవత్వం అవసరం లేదని తేల్చి చెప్పేసింది.
ఇలా ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా అరియానా మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇక ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్ గా అరియానా ఈ మాటలతో ఒక అడుగు ముందుకు వేసింది అనే చెప్పాలి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!