NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఓ సారి మాట్లాడుకుందామా..? చంద్రబాబు – కేసీఆర్ అంతరాలోచన..!?

అవసరాలు మనుషులనే మారుస్తాయి. రాజకీయులను మార్చడం ఓ లెక్కా..!?
“టైం” మనుషులనే మారుస్తుంది. రాజకీయాలను మార్చడం ఓ లెక్కా..!?

ఇప్పుడు ఆ అవసరం.., ఆ టైం.. ఇద్దరు చంద్రులకు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కలయికకు మూహూర్తం ఫిక్స్ అయిందంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇప్పుడు సర్వదా.., శతధా.., సహస్రధా సంచలనాంశమే..! ఆ అవసరం ఏమిటో.., ఆ టైం ఏమిటో.., ఆ సంచలన సందర్భం ఏమిటో చూద్దాం..!!

ఈ కలయిక కారణాలు మూడు..!!

చంద్రబాబు అవసరం కేసీఆర్ కి ఏమొచ్చింది..? కయ్యానికి కాలు దువ్వుకున్న ఈ ఇద్దరికీ ఇప్పుడు మళ్ళీ కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? అనేదే అందరి మదిలో మెదిలే అనుమానాలు. అందుకు కేసీఆర్ కి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకి అనేక కారణాలున్నాయి.

* జగన్ కేసీఆర్ కి దెబ్బ వేశారు. గత ఏడాది ఎన్నికల్లో పరోక్షంగా జగన్ విజయానికి కేసీఆర్ కొంతమేరకు సాయం చేశారు. చంద్రబాబుపై కోపంతో ఓ దశలో టీడీపీ ఆర్ధిక మూలాలపై దెబ్బ కొట్టారు. దీంతో టీడీపీ అనుకున్నంతగా ఖర్చు చేయలేక చాలా నియోజకవర్గాల్లో చేతులెత్తేసింది. తాను జగన్ కి అంతగా సాయం చేస్తే.. ఇప్పుడు జగన్ కేసీఆర్ మాట అసలు పట్టించుకోవట్లేదు. బీజేపీ భజనలో ఆరితేరుతున్నాడు. జగన్ ని, స్టాలిన్ ని, కేజ్రీవాల్ ని, నవీన్ పట్నాయక్ ని, మమతా బెనర్జీని కలుపుకుని తాను బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో చక్రం తిప్పాలి అనుకుంటే జగన్ తోక జాడించడం కేసీఆర్ కి నచ్చడం లేదు. అందుకే పరోక్షంగా జగన్ పై, ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రుల మాటల దాడి ఆరంభమయింది. అందుకే తన తోటి తెలుగు రాష్ట్రంలో ఒకరి తోడు ఉంటె బాగుంటుంది అనుకుంటున్న కేసీఆర్ కి జగన్ కంటే చంద్రబాబు కాస్త నయం అనిపిస్తుందట..!

mamata-banerjee-jagan-kcr-jpeg_1200x900

* కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి అనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలకు వెళ్లాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో, నేతలను సంప్రదింపుల్లో బాగా సీనియారిటీ ఉన్న చంద్రబాబు కేసీఆర్ కి అవసరమే. చంద్రబాబుకి మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, ఫరూక్ వంటి నేతలతో మంచి పరిచయాలున్నాయి. చంద్రబాబు కి ఏపీ చాలు. అందుకే కేసీఆర్ కి జాతీయ స్థాయిలో చంద్రబాబు పోటీ కాబోరు. ఈ ఆలోచనతో కేసీఆర్ మళ్ళీ చంద్రబాబుతో జత కట్టే సూచనలకు సంకేతాలు..!

* ఇకపోతే… త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. గ్రేటర్ లో టీడీపీకి, చంద్రబాబుకి కొంత మేరకు పట్టుంది. వారు సొంతంగా కార్పొరేటర్ సీట్లు గెలిచేంతగా కాకపోయినా దాదాపు 50 డివిజన్లలో గెలుపుని శాసించగలరు. కూకట్ పల్లి, సనత్ నగర్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్ , కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ జెండాలు ఇప్పటికీ ఎగురుతుంటాయి. గ్రేటర్ లో టీఆరెస్ కి బీజేపీ రూపంలో ముప్పు ఉంది. మేయర్ పీఠానికి ఏమాత్రం డోకా లేకుండా ఉండేందుకు, భావి అవసరాల దృష్ట్యా గ్రేటర్ లో టీడీపీ క్యాడర్ ని పూర్తిగా టీఆరెస్ కి మళ్ళాలి అంటే చంద్రబాబుతో కయ్యం ఇంకా కొనసాగించకూడదు అనేది కేసీఆర్ ఆలోచనట..! ఇలా ప్రధాన మూడు కారణాలతో పాటూ ఇతర కొన్ని సున్నిత అంశాల ఆధారంగా ఇద్దరి కలయికని కొందరు నేతలు కోరుకుంటున్నారట. అందుకే త్వరలోనే ఈ ఇద్దరి భేటీ జరిగినా ఆశ్చర్యం లేదు. ముందే చెప్పుకున్నాంగా..! అవసరాలు మనుషులనే మారుస్తాయి. రాజకీయులను మార్చడం ఓ లెక్కా..!? “టైం” మనుషులనే మారుస్తుంది. రాజకీయాలను మార్చడం ఓ లెక్కా..!?

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N