NewsOrbit
Featured బిగ్ స్టోరీ

Nimmagadda: బ్యాట్స్ మెన్ గా రిటైర్ అవుతూ.. పిచ్ పై బాంబు వేసాడు..! నిమ్మగడ్డ స్ట్రోక్ ఇదీ..!!

Nimmagadda: Last Bomb on AP Govt

Nimmagadda: ఓ బ్యాట్స్ మెన్ సొంత టీమ్ తో.. ప్రత్యర్థి టీమ్ తో తలబడుతూ.. ఆటలో తడబడుతూ.. వివాదాలకు బిందువవుతూ.. ఎలాగోలా సమయమొచ్చే సరికి చివరికి రిటైర్ అయ్యాడు… కానీ వెళ్తా, వెళ్తా పిచ్ పై ఒక బాంబు వేసి వెళ్ళాడు. ఆ బాంబు ఇప్పుడు పేలింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కి తగిలింది. ఆ పిచ్ కి తగిలింది. ఇదీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం. ఎన్నికల కమీషనర్ గా చివరి రోజుల్లో ఆయన చేసిన ఓ పని, ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోర్టులో ఓడిపోయేలా చేసింది..! రిటైర్ అయ్యాక కూడా నిమ్మగడ్డ కొట్టిన స్ట్రోక్ బౌండరీ దాటింది..!!

Nimmagadda: Last Bomb on AP Govt
Nimmagadda Last Bomb on AP Govt

Nimmagadda: సుప్రీమ్ ఏం చెప్పింది..!? ఏపీ ఏం చేసింది..!?

ఈరోజు ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడానికి ఒక్కటే మేజర్ కారణం. ఎన్నికల కోడ్ కనీసం నాలుగు వారాలు అమలవ్వాలి.. ఆ తర్వాత ఎన్నికలు జరగాలి. ఇవీ సుప్రీమ్ మార్గదర్శకాలు. కానీ వీటిని పట్టించుకోకుండా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని హైకోర్టు స్టే ఇచ్చింది. అంతకు ముందు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 50 రోజులకు పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. జనవరి చివరి వారంలో వచ్చిన ఎన్నికల కోడ్ మార్చి 15 వరకు ఉంది. సో.. పంచాయతీ ఎన్నికలకు, మున్సిపల్ ఎన్నికలకు ఇబ్బంది రాలేదు.

Nimmagadda: Last Bomb on AP Govt
Nimmagadda Last Bomb on AP Govt

నిమ్మగడ్డ ఎన్నికల కోడ్ ఎందుకు ఎత్తేసినట్టు..!?

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూసింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు కొనసాగింది. ఇవి పూర్తయిన వెంటనే కోడ్ ఎత్తేసారు. కానీ అప్పటికే “పరిషత్ ఎన్నికల కథ కోర్టులో ఉంది. రేపో, మాపో షెడ్యూల్ అనేట్టుగా ఉంది. మొత్తం సిద్ధమైంది. నిజానికి కోడ్ ఎత్తేయాల్సిన అవసరమే లేదు” కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తేసారు. దీంతో ఏప్రిల్ ఒకటిన ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు.. కేవలం 8 రోజులు మాత్రమే కోడ్ అమల్లో ఉన్నట్టు. ఇది చెల్లదు. “ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాడు ఎన్నికల కోడ్ ఎత్తేయకపోతే.. ఇప్పుడు ఏమాత్రం సమస్య వచ్చేది కాదు. ఈజీగా ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయేది. అన్నీ తెలిసి.., తాను రిటైర్ అయిన వెంటనే వచ్చే కొత్త ఎన్నికల కమీషనర్ ఇలా నోటిఫికేషన్ ఇస్తారని తెలిసి.. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం అది చెల్లదని తెలిసి.. తాను సింపుల్ గా కోడ్ ఎత్తేసి.. వెళ్లిపోయారు. అలా తన తెలివిని చూపించారు. బ్యాట్స్ మెన్ గా తన చివరి స్ట్రోక్ కొట్టారు. ఆ స్ట్రోక్ ఇప్పుడు బౌండరీని దాటింది. పిచ్ లో బాంబు వేసి వెళ్లారు. ఆ బాంబు ఇప్పుడు పేలింది. పాపం నీలం సాహ్నికి తగిలింది..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju