NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు హెల్త్

‘భీమా’ కట్టినా ధీమా ఉండడం లేదు !

గతంలో ఇన్సూరెన్స్ అనే పదం విన్న వెంటనే ఆ ఇస్సూరెన్స్ ఏజెంట్ లను తరిమికొట్టే వారిని సినిమాల్లో చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు అదే ఒక బ్రహ్మపదార్థం అయిపోయింది. దాదాపు ప్రతి ఉద్యోగి జీవిత బీమా ను కడుతున్నాడు. రేపు పొద్దున మీకు ఏదన్నా అయితే…. మీరు పోతే…. మీ కుటుంబానికి ఆసరాగా తోడుగా ఇన్సూరెన్స్ ఉంటుంది అన్న భరోసా ఒకవైపు ఇస్తూనే.. తమ మాటలతో భయం గొల్పుతూ ఇన్సూరెన్స్ ఏజెంట్ పాలసీలు అంట కడుతుంటారు. బలంగా…. నిక్షేపంగా ఉన్న ప్రాణాన్ని భయపెట్టి పాలసీలు అమ్మడం ఒక దశాబ్ద కాలంగా నడుస్తున్న వ్యాపారం.

 

ఇక ప్రతి ఏడూ ఇన్సూరెన్స్ లు కట్టడం అనేది మన వారికి చాలా బరువు. అమెరికా లాంటి దేశాల్లో జీవితబీమా, వాహన బీమా, ఆరోగ్య బీమా లేకపోతే అల్లాడిపోతారు. ఎందుకంటే అక్కడి పాలసీలు వేరు.. పద్ధతులు వేరు. కానీ అవంతా వారి జీవన విధానానికి తగ్గట్టు ఉంటాయి. ఇక మన దేశానికి వస్తే ఆ ఇన్సూరెన్స్ ను క్లైమ్ చేసుకోవడం ఒక విద్య. గోడౌనులు కొన్ని రాత్రికి రాత్రి కాలిపోయి కొద్దిరోజుల ఇన్సూరెన్స్ డబ్బులతో మళ్ళీ మొత్తం సమకూర్చుకుంటారు. ఇక జీవిత బీమా డబ్బు కోసం ఒకరిని హత్య చేసి దానిని ప్రమాదంలా చిత్రీకరించబోయి పోలీసులకు దొరికి జైల్లో మగ్గుతున్న వారు కూడా ఉన్నారు.

ఇలాంటి సమయంలో కరోనా దెబ్బకు ఈ మధ్య అందరూ జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీల గురించి తెలుసుకుంటున్నారు…. పాలసీలు తీసుకున్నారు. అయితే ఇన్సూరెన్స్ స్వరూపస్వభావాలు గమనించిన వారు…. ఇన్సూరెన్స్ కలలు కల్లలైన వారు యొక్క అనుభవంతో తెలుసుకున్న విషయాలు ఇలా ఉంటాయి.

  • ఇన్సూరెన్స్ పాలసీలు అవసరానికి ఉపయోగపడవచ్చు లేదా…. ఉపయోగపడక పోవచ్చు.
  • ఇన్సూరెన్స్ ఉండి తమ వ్యాధి కి అయ్యా డబ్బుల రీత్యా… ఖాళీగా ఉన్న ఆసుపత్రులలో మాత్రమే బెడ్లు సులువుగా దొరుకుతాయి.
  • ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారిని ఆసుపత్రులు అంటరాని వారిగా చూస్తాయి అన్న సామాజిక స్పృహ మనకు తప్పనిసరిగా ఉండాలి.
  • ఈ మధ్యన ఎక్కడా వాదన చేసి పెద్దగా ఉపయోగం ఉండడం లేదు.
  • గ్రూప్ ఇన్సూరెన్స్…. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ వంటి పేర్లు గొప్పగా ఉన్నా కూడా అందులోని నియమనిబంధనలు.
  • కాగితాల మీద చూడకుండా సంతకం పెడితే…. చివరికి ఆసుపత్రిలో ఆ సంతకాలే మన ముఖం మీడ వెక్కిరిస్తూ ఉంటాయి.
  • కరోనా విషయంలో ఇన్సూరెన్స్ కు విలువ లేదు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju