Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్” సినిమా జూన్ 16వ తారీఖున విడుదల కాబోతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీతారాములుగా ప్రభాస్, కృతి సన్నాన్ నటించడం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన “ఆదిపురుష్” టీజర్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తాన్ని సినిమా యూనిట్ ఫిక్స్ చేసింది.
తెలుగుకి సంబంధించి జూన్ 6వ తేదీన తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ…”ఆదిపురుష్”టీం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందన్న అంచనాలతో అభిమానులు ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదల కావాలి. అయితే గత ఏడాది అక్టోబర్ నెలలో “ఆదిపురుష్”కి సంబంధించి విడుదలైన మొదటి టీజర్ కి భారీగా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ట్రోలింగ్ కూడా విపరీతంగా జరిగింది. ఈ దెబ్బతో సినిమా యూనిట్ వెనక్కి తగ్గి… గ్రాఫిక్స్ మరియు విజువల్ వర్క్ లో మార్పులు చేర్పులు చేసి లేటెస్ట్ ప్రింట్ తో జూన్ 16వ తారీకు విడుదల చేస్తున్నారు.
అయితే ఐదు భాషలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలు భారీ ఎత్తున ఉండేలా సినిమా యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ప్రభాస్ “ఆదిపురుష్” పై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. పైగా ప్రభాస్ ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ తో చేస్తున్న సినిమా కావటంతో… తెలుగు అభిమానులు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా “ఆదిపురుష్” మంచి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.