RRR: “ఆర్ఆర్ఆర్” నిన్న రిలీజ్ అయిన ప్రతీచోటా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరోసారి రాజమౌళి తన సత్తా ఏంటో దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో “ఆర్ఆర్ఆర్” ద్వారా రుజువు చేశాడని సినిమా చూసిన వాళ్లు చెప్పుకొస్తున్నారు. “బాహుబలి”తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్ ఓ స్థాయిలో కి తీసుకెళ్లగా “ఆర్ఆర్ఆర్” తో మరో మెట్టు పైకి ఎక్కించరని జనాలు అంటున్నారు. ముఖ్యంగా చరణ్, ఎన్టీఆర్ సినిమాలో నువ్వానేనా అన్నట్టుగా నటించారని చెప్పుకొస్తున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు టైం ఈ సినిమాకి కేటాయించడంతో రిజల్ట్ అద్భుతంగా రావడంతో విడుదలైన ప్రతి చోటా హిట్ టాక్ తో “ఆర్ఆర్ఆర్” రికార్డు స్థాయి కలెక్షన్ల తో దూసుకుపోతోంది. గ్యారెంటీగా “బాహుబలి” రికార్డులను బ్రేక్ చేయడం జరుగుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉంటే సామాన్య ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీల వరకు “ఆర్ఆర్ఆర్” పై రియాక్ట్ అవుతున్నారు.
“ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ నీ అదే విధంగా ప్రత్యేకంగా దర్శకుడు రాజమౌళిని హీరోలు ఎన్టీఆర్, చరణ్ లని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కుటుంబ సమేతంగా “ఆర్ఆర్ఆర్” నీ సెలబ్రిటీలు చూస్తూ ఉన్నారు. నిన్ననే మెగాస్టార్ కుటుంబం మరియు యు.ఎన్ టీఆర్ కుటుంబం AMB లో మూవీని తిలకించ గా.. తాజాగా నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లో అదే థియేటర్ లో బన్నీ కుటుంబసమేతంగా సినిమాని తిలకించారు. అనంతరం “ఆర్ఆర్ఆర్” గురించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అదేమిటంటే “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ కి అభినందనలు. డైరెక్టర్ రాజమౌళి విజన్ నీ గౌరవిస్తున్నాను.
నా సోదరుడు మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తన కెరియర్లోనే ఇచ్చాడు. ఇక మా బావ తారక్.. పెర్ఫార్మెన్స్ పవర్ హౌస్ లాగా ఉంది. ఎంతగానో ఆస్వాదించాను ఇదేవిధంగా సినిమాలో నటించిన మిగతా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు హీరోయిన్ ఆలియా భట్ పై తనదైన శైలిలో బన్నీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని మరో లెవెల్ లోకి “ఆర్ఆర్ఆర్” ద్వారా తీసుకెళ్లినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ బన్నీ రియాక్ట్ అయ్యారు. దీంతో అల్లు అర్జున్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!