సినిమా

సరికొత్త మజిలీ ఆకట్టుకుంది

Share

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న మ‌జిలీ చిత్ర టీజ‌ర్ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. ఈ టీజ‌ర్ లో నాగ‌చైత‌న్య రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించారు. ఒక‌టి క్రికెట‌ర్ పాత్ర కాగా.. మ‌రొక‌టి మిడిల్ ఏజ్ పాత్ర‌. రెండు కారెక్ట‌ర్స్ తోనూ ఆక‌ట్టుకున్నారు నాగ‌చైత‌న్య‌. స‌మంత ఇందులో మ‌ధ్య త‌ర‌గ‌తి గృహిణి పాత్ర‌లో న‌టిస్తున్నారు. భ‌ర్త‌పై ఎంతో జాగ్ర‌త్త‌గా.. ప్రేమ‌గా ఉండే భార్య‌గా ఇందులో న‌టిస్తున్నారు స‌మంత‌. టీజ‌ర్ లో ఎమోష‌న్స్ అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ టీజ‌ర్ లో కొన్ని డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి..
“నువ్వు నా రూమ్ లోపలికి రాగలవేమోగాని…  నా మనసులోకి  ఎప్పటికీ  రాలేవు…!
నీకో సంవ్సతరం టైమ్ ఇస్తున్నాను… ఈలోగా స‌చినే అవుతావో… సోంబేరి అవుతావో.. నీ ఇష్టం..
ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు.. అది వస్తువు అయినా.. మనిషి అయినా…
వెధవలికి ఎప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేసావ్”
గోపీసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆయ‌న అందించిన విజువ‌ల్స్ టీజ‌ర్లో అద్భుతంగా ఉన్నాయి. సాహు గర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌జిలీ చిత్రం ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది.

Share

Related posts

Divya Bharathi Sky Blue Saree Photos

Gallery Desk

Satyameva Jayathe : పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే.. సత్యమేవ జయతే లిరికల్ సాంగ్ అదుర్స్..!!

bharani jella

Thaman: థమన్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్..నిలబెట్టుకుంటాడా..?

GRK

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar