కస్టమర్లకు అలాంటి ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ… కారణం ఏమిటంటే?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన అభిమానులకు లక్కీ ఛాన్స్ కల్పించాడు. అక్కడ కేఫ్ తాగే వారికి సగం బిల్ తానే కడతానని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కస్టమర్లకు విజయ్ దేవరకొండ బిల్ కట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? సెన్సేషనల్ స్టార్ గా ఉన్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా ఓ బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ అనే రెస్టారెంట్ ను ప్రారంబిస్తున్న సందర్భంలో కస్టమర్లకు ఈ అవకాశాన్ని విజయ్ దేవరకొండ కల్పించారు.

 

విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమా ద్వారా తెలుగు తెలుగులో అరంగ్రేటం చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే తన రెండో చిత్రం “మిడిల్ క్లాస్ మెలోడీస్”ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సూపర్ హిట్ కావడంతో, ఆనంద్ దేవరకొండ సక్సెస్ సెలబ్రేషన్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా ద్వారా పొందిన రెమ్యూనరేషన్ చెక్ ను తన స్నేహితుడికి ఇచ్చేశారు. ఒక మంచి రెస్టారెంట్ నడపాలని ఎప్పటి నుంచో తన స్నేహితుడి కోరిక కావడంతో తన స్నేహితుడి కోరిక నెరవేర్చడానికి చెక్ ఇచ్చినట్లు ఆనంద్ తెలిపారు. తన పారితోషికం ద్వారా తెర బయట ఒక మంచి ఆహారాన్ని ప్రజలకు అందిస్తుందన్నారు. అయితే ఈ వ్యాపారంలో మంచి స్థాయికి ఎదగాలంటే అందుకు మీ సహకారం కావాలని ఆయన కోరారు.

ఆనంద దేవరకొండ తన స్నేహితుడితో కలిసి “గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్” హైదరాబాద్‌లో ఖాజాగూడలో పెట్టారు. అయితే తన తమ్ముడు పెట్టిన బిజినెస్ కు ప్రోత్సాహంగా ఈ కేఫ్ లో ఈశని ,ఆదివారం వచ్చే కస్టమర్లకు సగం బిల్లు తానే కడతానని తెలియజేశారు. అంతేకాకుండా తన మంచి మూడ్లో ఉన్నానని మిడిల్ క్లాస్ మెలోడీ ద్వారా నా స్నేహితులు ఈ రెస్టారెంట్ ప్రారంభిస్తున్న సందర్భంగా అందరూ వచ్చి ఈ కేఫ్ ఆస్వాదించండి…సగం బిల్ నాది… హగ్స్, కిసేస్ మీకు అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేసారు.