Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 5 సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. వీటిలో మెగా మల్టీస్టారర్‌గా కొరటాల శివ తెరకెక్కించి ఆచార్య ఈ నెల 29న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఆచార్య అందుకునే సక్సెస్‌తో సాధించే వసూళ్ళతో మెగాస్టార్ తర్వాత వచ్చే సినిమాల మీద అంచనాలు ఉంటాయి. ఇక చిరు నటిస్తున్న సినిమాలలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా ఒకటి.
ఛలో, భీష్మ సినిమాలతో హిట్స్ అందుకొని టాలెంటెడ్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు వెంకీ కుడుముల. తన దర్శకత్వంలో మెగాస్టార్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. జస్ట్ రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడికి చిరు ఓకే చెప్పారంటే..ఖచ్చితంగా కథ మెగాస్టార్‌ను ఎంతో ఎగ్జైట్ చేసి ఉండాలి. అందుకే ఆయన ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్‌తో పాటుగా మరో మెగా హీరోనే..?
అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా మరో స్టార్ హీరో నటించబోతున్నాడట. ఇప్పటికే, గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్ లాంటివారు నటిస్తున్నారు. అలాగే, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక మెగా 154లో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వెంకీ కుడుముల సినిమాలో మెగాస్టార్‌తో పాటుగా స్క్రీన్ షేర్ చేసుకునే మరో స్టార్ హీరో మెగా హీరోనే అంటున్నారు. చూడాలి మరి ఆ హీరో ఎవరో. కాగా, ఈ సినిమా మెగా 156గా రాబోతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!