25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
సినిమా

Ante Sundaraniki Trailer: `అంటే.. సుందరానికీ` ట్రైల‌ర్ అదిరిపోయింది అంతే!

Share

Ante Sundaraniki Trailer: న్యాచుర‌ల్ స్టార్ నాని, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ న‌జ్రీయా న‌జీమ్ తొలిసారి జంట‌గా న‌టించిన చిత్రం `అంటే.. సుంద‌రానికీ!`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. సీనియర్ నటుడు నరేష్‌తో పాటు రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌మిస్తున్న చిత్ర టీమ్‌.. తాజాగా `అంటే.. సుంద‌రానికీ!` ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. అమెరికాకు వెళ్లాలని కలలు కనే అమాయకపు బ్రాహ్మణుడు సుందర్ ప్రసాద్ గా నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్‌లు ఇందులో కనిపించ‌నున్నారు.

ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌వ‌ని తెలిసినా సుందర్ మరియు లీలాలు ప్రేమ‌లో ప‌డ‌తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? పెద్ద‌ల‌ను ఒప్పించ‌డానికి వారిద్ద‌రు ఎలాంటి ఎత్తులు వేసి ఒక‌ట‌య్యారు..? అన్న‌దే సినిమాగా ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఆద్యంతం ఫ‌న్నీగా సాగిన ట్రైల‌ర్ అదిరిపోయింద‌ని చెప్పాలి.

నాని, న‌జ్రీయాల కెమెస్ట్రీ సూప‌ర్‌గా వ‌ర్కౌట్ అయింది. వివేక్ ఆత్రేయ మార్క్ ఫన్, బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్‌, విజువల్స్ వంటి అంశాలు కూడా బాగున్నాయి. ఇక‌ మొన్న బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. ఈ ట్రైలర్ మరింత వినోదాన్ని పంచుతూ మూవీపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను నాని అందుకుని స‌క్సెస్ అవుతాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.


Share

Related posts

NTR 30: ఉగాది సందర్భంగా “NTR 30” అప్ డేట్ ఇచ్చిన సినిమా యూనిట్..!!

sekhar

జోడి కుదిరేనా?

Siva Prasad

టాలీవుడ్: సోషల్ మీడియాను రఫ్పాడేస్తున్న స్టార్ కిడ్స్

Muraliak