Anupama Parameswaran: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన `అఆ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్.. తొలి చిత్రంతోనే తనదైన అందం, అభినయం మరియు క్యూట్ నెస్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ మూవీ తర్వాత అనుపమకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి.
కానీ, నటను ప్రాధాన్యమున్న ప్రాతలను మాత్రమే ఎంచుకుంటూ టాలీవుడ్లో స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక అందాల ఆరబోతకు ఎప్పుడూ దూరంగానే ఉండే ఈ కోలకళ్ల కేరళ కుట్టి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా చీర కట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమ.. క్యూట్ క్యూట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.
ఆపై అందుకు సంబంధిన పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అందమైన చీరలో అనుపమ మరింత అందంగా మెరిసిపోతోంది. దీంతో ఆమె పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు.. వామ్మో చీరలో అనుపమ ఇంత అందంగా ఉందేంటి..ఇలాగైతే రాత్రికి నిద్ర పట్టడం కష్టమే అంటూ చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `రౌడీ బాయ్స్`తో ప్రేక్షకులను పలకరించిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ సరసన 18 పేజీస్, కార్తీకేయ 2 చిత్రాలు చేస్తోంది. అలాగే వీటితో పాటు హెలెన్, బటర్ ఫ్లై అనే సినిమాల్లోనూ ఈ బ్యూటీ నటిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!